ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ
సూర్య రాజంపేట :రాజంపేట మండల కేంద్రము లో గ్రామాధ్యక్షులు పటేల్ సాయిబాబా ఆధ్వర్యంలో రెండో విడతలో భాగంగా ఐదుగురు అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రొసీడింగ్స్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి బాబు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.