ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాపై క్షేత్రస్థాయి వెరిఫికేషన్
సూర్య బెజ్జుర్: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలంలోని ఉట్స్ సారంగపల్లి, లంబాడిగూడ గ్రామపంచాయతీల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా విడుదలైన నేపథ్యంలో వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా ఎంఈఓ సునీత క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారుల వివరాలను పరిశీలిస్తూ సర్వే నిర్వహించారు.ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన జాబితాలో ఉన్న వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, లబ్ధిదారుల వివరాల ధ్రువీకరణ కోసం ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిసింది.