ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బిఆర్ఎస్ నాయకులు
దేవరుప్పుల , మేజర్ న్యూస్, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే నిజమైన నాయకత్వానికి నిదర్శనమని చాటుతూ బీఆర్ఎస్ జిల్లా నాయకులు బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ తన సేవాభావాన్ని చాటుకున్నారు. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు దేవరుప్పుల మండలంలోని పర్రెల తండాకు సిమెంట్ బెంచీలను బహూకరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తండావాసులకు ఉపయోగపడేలా సిమెంట్ బెంచీలను అందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి, ఇచ్చిన హామీలను కార్యరూపంలోకి తీసుకురావడం నాయకుడిగా తన బాధ్యతగా భావిస్తున్నానని ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ పేర్కొన్నారు. చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటాం.. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ నిరంతరం ప్రజాసేవలో ముందుంటాం అని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల హామీని నెరవేర్చి తమకు ఉపయోగపడే సిమెంట్ బెంచీలను అందించిన బబ్బూరి శ్రీకాంత్ గౌడ్‌కు పర్రెల తండావాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పానుగంటి గిరిబాబు ఉప సర్పంచ్ చంద్రగిరి సంపత్ గ్రామ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.