BREAKING
వారం రోజులుగా మరమ్మతులు ఏవీ?? డ్రైనేజీ తాగునీటికి శాశ్వత పరిష్కారం -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్ ఎన్నికల సమయంలో జాగ్రత్త ఎస్సై మహేష్ ఓట్ల తొలగింపును అడ్డుకోవాలి: డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలోకి 10 కుటుంబాలు!. * ఆహ్వానించిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి * కరువు ముప్పు పొంచి ఉన్నా.. కొత్త బోర్లకు అడ్డుకట్టేది ఎవరు? జోరుగా ఆరు పిక్కల జూదం!. - * ‘సింగిల్ మాది.. డబుల్ మీది’ పేరుతో దందా * అనాథ వృద్ధులకు బాలవికాస అండ 40 మంది వృద్ధులకు నిత్యావసర సరుకులు, సమస్యాత్మక గ్రామాలు గుర్తించి అధికారులు అప్రమత్తంగా ఉండాలి తిరుపతిలో టీడీపీకి తిరుగులేదు జేబీ శ్రీనివాస్‌కు కమ్మ సంఘం మద్దతు 66 డివిజన్లలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం విద్యార్థి హక్కుల పోరాటానికి బీఆర్ఎస్వీ బలోపేతం -బండచర్లపల్లి,రావురూకులలో నూతన విద్యార్థి కమిటీల ఏర్పాటు నటి ఇంద్రజ చేతుల మీదుగా ‘జుఒన్‌’ సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ.. ఒకే వేదికపై 25 రకాల సేవలు! ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు మృత కార్మికుల కుటుంబాలకు యూనియన్ అండ.. -రూ.20 వేల సాయం! తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తత అవసరం * సూచనలు అందజేసిన మండల ఏవో మెట్ట మోహనరావు *

"మా అమ్మను ఎలా బలి చేస్తారు?"

Select Suryaa Now
"మా అమ్మను ఎలా బలి చేస్తారు?"

రేవంత్ రెడ్డిపై మండిపడ్డ కొండా సుస్మిత
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌ అంశంపై ఆమె కుమార్తె కొండా సుస్మిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తప్పుబడుతూ, ఆయన బీసీ నేతలను టార్గెట్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

"రేవంత్ రెడ్డి కేవలం వన్ టైమ్ జెడ్పీటీసీ, వన్ టైమ్ ఎమ్మెల్సీ, వన్‌టైమ్ ఎమ్మెల్యే మరియు వన్ టైమ్ ఎంపీ మాత్రమే. కానీ మా అమ్మ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత. అలాంటి నేతను రేవంత్ రెడ్డి తీవ్రంగా అవమానించారు." "నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కేవలం ఒక వ్యక్తి (రేవంత్ రెడ్డి) వైఖరికి వ్యతిరేకంగా మాత్రమే నా గళం విప్పాను."

"గతంలో బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదైనప్పుడు, కొడుకు చేసిన తప్పుకు బండి సంజయ్‌ను ఎలా అరెస్ట్ చేస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మరి అలాంటప్పుడు నేను చేసిన వ్యాఖ్యలకు మా అమ్మను ఎలా బలి చేస్తారు?" అని సుస్మిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని ఆరోపించిన కొండా సుస్మిత వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.