ఎమ్మెల్సీ సహకారంతో,ఆడేపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
సూర్య చింతల మానేపల్లి:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం ఆడేపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులను మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు డుబ్బుల నానయ్య ప్రారంభించారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ సహకారంతో ఆడేపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద రూ.5 లక్షల వ్యయంతో మంజూరైన సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని గ్రామస్తులకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా త్వరలోనే రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.ప్రభుత్వ నిధులతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని ఉపాధి హామీ పథకం ద్వారా మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.