ఎల్ నినొప్రభావం ,ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు.
వట్టిపల్లి;మండలంలోని దుద్యాల గ్రామంలో శనివారం నాడు (ఎల్ నినో ప్రభావం ఆయిల్ ఫామ్ సాగుపై) అవగాహన సదస్సు నిర్వహించినారు. హార్టికల్చర్ ఆఫీసర్ శైలజ మాట్లాడుతూ! ఆయిల్ ఫామ్ తోటలలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించినారు. జీవ ఎరువులు వాడాలి అన్నారు. ఎండ ప్రభావం ఎక్కువగా ఉండుట చేత కెమికల్ మందులు వాడరాదు అన్నారు. అంతర పంటలు పప్పు దినుసులు వేసుకోవాలన్నారు. తోటల చుట్టూ టేకు, వెదురు మొక్కలు పెంచుకోవాలి అని తెలిపినారు. మల్చింగ్ గాను 50 శాతం, ఫార్మా ఫండ్ నిర్మాణానికి 90 వేల రూపాయలు, వర్మీ కంపోస్ట్ యూనిట్ కి 50 వేల రూపాయలు సబ్సిడీ లభిస్తుంది అని తెలిపినారు. వెదురు మొక్కలు 50 శాతం సబ్సిడీ అందిస్తామని అన్నారు. రైతులు పామ్ ఆయిల్ చెట్లను నాటడంలో ఎలాంటి సందేహాలు, సంశయాలు ఉన్న ఫోన్ ద్వారా తెలుపగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టికల్చర్ ఆఫీసర్ శైలజ తో పాటు డాక్టర్ నాగ హర్షిత సైంటిస్ట్ మరియు గ్రామ సర్పంచ్, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.