BREAKING
బెల్జియం ట్యాక్స్ ఏజెన్సీపై సైబర్ దాడి కలకలం.. ఆన్‌లైన్ పోర్టల్ తాత్కాలిక నిలిపివేత ఆర్నబ్ తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి....ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్... మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కసిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీలను అభినందిస్తున్న ..ఎంపీ శబరి..! ఎయిర్‌ కెనడా, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానయాన ఒప్పందం ప్రధాని మోదీపై ఖర్గే వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ దళిత మోర్చా నేత నింగ్యారి యాదగిరి* సైబర్ నేరాల పట్ల యువత అవగాహన కలిగి ఉండాలి* 2030 లక్ష్య సాధనకు భారత్ బృహత్తర ప్రణాళిక ఏఐ ట్రైనింగ్ వర్కర్లపై చట్టవిరుద్ధ నిఘా ఆరోపణలను ఖండించిన స్కేల్ ఏఐ రక్తదానం గొప్ప సామాజిక సేవకు ప్రతీక పెరుగుతున్న వాతావరణ ముప్పుపై భీమా రంగం హెచ్చరిక శివన్నగూడెం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి.. ఉమ్మడి నల్లగొండ రైతులకు నీటి భరోసా కల్పించాలి! చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అమెరికా వ్యాపార దిగ్గజాల కీలక డిమాండ్..రాజకీయ స్థిరత్వం, సుస్థిర ఆర్థిక విధానాలే ప్రాధాన్యత తుఫాన్ వర్షాలకు పెద్దూరులో కూలిన ఇంటి స్లాబ్

ఈపీఎఫ్ ప్రయోజనాలపై అవగాహన ఉండాలి

Select Suryaa Now
ఈపీఎఫ్ ప్రయోజనాలపై అవగాహన ఉండాలి

సూర్య, హుజురాబాద్:ప్రైవేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు ఈపీఎఫ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, వాటిపట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని కరీంనగర్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయ సూపరిండెంట్ మాజేటి రమేష్ అన్నారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని ఆదర్శ విద్యాలయంలో ఉద్యోగులకు ఈ పిఎఫ్ ఫై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఈపీఎఫ్ సభ్యత్వం ఉన్న ఉద్యోగి ఎవరైనా సర్వీసులో మరణిస్తే 2.50 లక్షల రూపాయల నుండి 7 లక్షల రూపాయల వరకు బీమా వస్తుందన్నారు. 10 సంవత్సరాలు ఒక సంస్థలో గాని, వివిధ సంస్థల్లో గాని పనిచేసిన సర్వీసు ఉన్న వారందరూ పెన్షన్ కు అర్హులు అని అన్నారు. ఇంతే కాకుండా ప్రధానమంత్రి నూతనంగా ప్రవేశపెట్టిన  పీఎం విబి ఆర్ వై పథకం ద్వారా ప్రవేటు విద్యాసంస్థల్లో పనిచేసే నూతన ఉద్యోగులు ప్రయోజనం పొందవచ్చు అన్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి తమ నామినేషన్ వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసుకోవడం మంచిదన్నారు. 50 సంవత్సరాల వయసు కలిగిన ఉద్యోగులు పింఛన్ కు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు ఎలాంటి సందేహాలు ఉన్న కరీంనగర్ ఈపీఎఫ్ కార్యాలయమునకు ఫోన్ ద్వారా గాని స్వయంగా గాని వచ్చి తెలుసుకోవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గూడూరు అనిల్, కరస్పాండెంట్ పి కిరణ్ కుమార్, ఉద్యోగులు  పాల్గొన్నారు.