BREAKING
అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ విడుదల తేదీ ఖరారు: ఏడాది నిరీక్షణ తర్వాత థియేటర్లలోకి వస్తున్న సరికొత్త చిత్రం అనిరుధ్ వివాహ వేడుకలో రజనీకాంత్ సందడి: ‘మనసిలాయో’ సాంగ్‌కు అదిరిపోయే డ్యాన్స్, వీడియో వైరల్ పట్టాలెక్కిన అత్యాధునిక ‘అమృత్ భారత్ 3.0’ సిటీ కోసం ఇది చేయాల్సిందే: తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణపై నటుడు నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు మైత్రి రవిశంకర్ పై దర్శకుడు బుచ్చిబాబు ఫన్నీ కామెంట్స్: ఈవెంట్‌కు పది వేలు ఇవ్వండి ప్లీజ్ ఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. వందేళ్ల కలను సాకారం చేసిన ఎమ్మెల్యే అమిలినేని. పండుగ వాతావరణం లో జల హారతి. భూభారతి రీ-సర్వేపై గ్రామసభలు చిన్నారుల్లో న్యుమోనియా నివారణపై అవగాహన కార్యక్రమం నమ్మకమైన భాగస్వామి ఉంటే విజయాలు తథ్యం: సీఎం చంద్రబాబు శంషాబాద్ ఎమ్మార్వో పిటీషన్ కొట్టివేసిన హైకోర్టు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం భూ రీ సర్వేకు రైతులు సహకరించాలి పత్త లేని అత్తాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి! వికలాంగుల సంఘాలకు అవకాశం కల్పించాలి

ఈనెల 14న నర్సాయపల్లిలో దివంగత పాండుగౌడ్ సంస్మరణ సభ*

Select Suryaa Now
ఈనెల 14న నర్సాయపల్లిలో దివంగత పాండుగౌడ్ సంస్మరణ సభ*

 

*కాంగ్రెస్ సర్పంచ్ లు, సింగిల్ విండొ డైరెక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ , ఎన్ఎస్ యుఐ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలి : మాడ్గుల మండల కాంగ్రెస్ అధ్యక్షులు భట్టు కిషన్ రెడ్డి*

*మాడ్గుల, మేజర్ న్యూస్*

మాడ్గుల మండలం నర్సాయపల్లి గ్రామంలో ఈనెల 14న శనివారం ఉదయం 10-30 గంటలకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎంపిటిసి సభ్యులు దివంగత కొత్త పాండుగౌడ్ సంస్మరణ సభ నిర్వహించడం జరుగుతుందని మాడ్గుల మండల కాంగ్రెస్ అధ్యక్షులు ,ఆమనగల్లు వ్యవసాయమార్కెట్ కమిటి మాజీ చైర్మన్ భట్టు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, తెలంగాణ గ్రామపంచాయతి ట్రిబ్యునల్ చైర్మన్ సూధిని రాంరెడ్డి, అభ్యుదయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సూధిని పద్మారెడ్డి, మాడ్గుల సింగిల్ విండో చైర్మన్ యాచారం వెంకటేశ్వర్లుగౌడ్, మాడ్గుల మాజీ జడ్.పి.టి.సి గౌరవరం ప్రభాకర్ రెడ్డి, టిపిసిసి సభ్యులు ఆయిల్ల శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి ఆమనగల్లు సింగిల్ విండో చైర్మన్ గూడురు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నరసింహ, నియోజకవర్గంలోని వివిధ మండలాల కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారని ఆయన వివరించారు. ఈ మేరకు గురువారం ఏఎమ్ సి మాజీ చైర్మన్ బికెఆర్ మేజర్ న్యూస్ తో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపిటిసి సభ్యులు కొత్త పాండుగౌడ్ సంస్మరణ సభకు వివిధ మండలాల మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ సర్పంచ్ లు, సింగిల్ విండొ డైరెక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ , ఎన్ఎస్ యుఐ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సంస్మరణ సభ అనంతరం భోజన కార్యక్రమం ఉంటుందని ఏఎమ్ సి మాజీ చైర్మన్ వివరించారు.
------------------
ఆర్.నర్సింహ్మ, మేజర్ న్యూస్ : మాడ్గుల, రంగారెడ్డి జిల్లా