దుర్గమ్మ నవరాత్రుల సందర్భంగా ఘనంగా బోనాలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు
కొల్చారం;మెదక్ జిల్లా కొల్చల్ మండల కేంద్రంలో వీరభద్ర ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, బోనాలను తలపై ఎత్తుకొని భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి నామస్మరణలు, భక్తుల జయజయధ్వానాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. గ్రామ ప్రజలు అమ్మవారి ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో కొల్చారం గ్రామం ఉప సర్పంచ్ కోరంపల్లి రాణి కవిత సబిత నాగరాణి జ్యోతి వీరమణి లక్ష్మి మరియు గ్రామ మహిళలు, భక్తులు, యువకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.