దుర్గాష్టమి సందర్భంగా నిరుపేద పిల్లలకు దుస్తుల పంపిణీ
మాదాపూర్,మేజర్ న్యూస్ : దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని దర్శ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద పిల్లలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ, రహమత్ నగర్‌లో బంగారు మైసమ్మ దేవాలయం సమీపంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దర్శ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శివ మాలతీ భూపతి గారితో పాటు ట్రస్టీలు శివ సాయి కుమార్ భూపతి, సాయికుమార్ గణేష్, కృష్ణ కుమార్ శర్మ, ఆకుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
దుర్గాష్టమి పండుగను పురస్కరించుకుని పేద పిల్లలకు కొత్త బట్టలు అందజేయడం ద్వారా వారిలో ఆనందాన్ని నింపారు. పండుగ వేళ నిరుపేద పిల్లలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం అందిస్తూ, సేవా కార్యక్రమాల ద్వారా సామాజిక బాధ్యతను నెరవేర్చడమే దర్శ చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యమని పేర్కొన్నారు.