telangana
దివ్యాంగ విద్యార్థులకు ఆటల పోటీలు
సూర్య రాజంపేట : రాజంపేటమండల స్థాయి దివ్యాంగ విద్యార్థుల ఆటల పోటీలను రాజంపేట మండలంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి పూర్ణచంద్ర, కాంప్లెక్స్ హెచ్‌ఎం ఈశ్వర్, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు సంతోష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం, ధైర్యాన్ని పెంపొందించేలా పలు ఉదాహరణలతో ప్రోత్సహించారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను వివరించారు. కార్యక్రమంలో స్పెషల్ ఎడ్యుకేటర్లు మహేశ్వరి, సురేందర్, అమీర్, దివ్యాంగ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు..