telangana
దిందా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు
సూర్య , చింతలమానేపల్లి : దిందా గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసును పునరుద్ధరించేందుకు గ్రామ పంచాయతీ చర్యలు చేపట్టింది. బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ మాడవి నిర్మలా వసంత్, ఉపసర్పంచ్ వాగడి శంకర్ ఆధ్వర్యంలో దిందా–చిత్తమ రహదారిపై గుంతల పూడ్చివేత పనులు చేపట్టారు. గూడెం వెళ్లే ఆర్టీసీ బస్సును దింద మీదుగా నడిపించేందుకు రహదారిని సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు సర్వీసును పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని సర్పంచ్, ఉపసర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తిరుపతి, డగే నారాయణ, ఎల్కారి రాజేష్, డొకే రామన్న, మాజీ ఉపసర్పంచ్ డగే సురేష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.