BREAKING
అసత్యంపై ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది: ద్వారక దసరా వేడుకల్లో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం! భారత విమానయాన రంగంలో రికార్డుల ప్రస్థానం: 2047 నాటికి 130 కోట్ల ప్రయాణికులే లక్ష్యం.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి! సంపద, విజ్ఞానం, శక్తి కలబోసిన భారత్‌గా తీర్చిదిద్దడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం: తజికిస్తాన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టీకరణ! కొద్ది వారాల్లోనే భారత్-అమెరికా చారిత్రక వాణిజ్య ఒప్పందం: యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన ప్రకటన! ఉగ్రవాదంపై మా భాగస్వామ్య దేశాలు జీరో టాలరెన్స్ చూపించాలి: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ.. తహవ్వుర్ రాణా అప్పగింతపై హర్షం! 'ఉడాన్' పథకానికి పదేళ్లు: దేశవ్యాప్తంగా 1.72 కోట్ల మందికి విమాన ప్రయాణం.. 687 రూట్లతో సామాన్యుడి సొంతమైన ఆకాశం! భారత్-న్యూజిలాండ్ చారిత్రక వాణిజ్య ఒప్పందం అమలు.. ఇరుదేశాల హర్షం! హరిహర క్షేత్రంలో ఘనంగా శమి పూజలు 2029 డిసెంబర్ 31 నాటికి పంజాబ్‌ను ‘నశా ముక్త్’గా మారుస్తాం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టమైన డెడ్‌లైన్! ఎన్నికలు రాగానే పంజాబ్ గుర్తొచ్చిందా?: అమిత్ షాపై భగవంత్ మాన్ ధ్వజం! కాలనేమి కూడా రాముడి నామాన్ని జపించేవాడు: అయోధ్యపై విపక్షాల దుష్ప్రచారంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర వ్యాఖ్యలు! మహారాష్ట్రలో ప్రభుత్వం మారాల్సిందే: దసరా ర్యాలీలో బీజేపీపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ధ్వజం! అమెరికాలో 3 లక్షల వీసాల రద్దు.. నేరస్థులపై ఉక్కుపాదం! పాకిస్తాన్, సౌదీ అరేబియాతో చారిత్రక 'మక్కా రక్షణ ఒప్పందం': ధ్రువీకరణ కోసం పార్లమెంటుకు పంపిన టర్కీ ప్రభుత్వం! ఇంధన సంక్షోభంపై మాక్రాన్ వ్యూహం: గల్ఫ్ దేశాల నుంచి భారీగా డీజిల్ కొనుగోలు

దేవీ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి: జిల్లా ఎస్పీ డాక్టర్ జి.వినీత్

Select Suryaa Now
దేవీ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి: జిల్లా ఎస్పీ డాక్టర్ జి.వినీత్

నారాయణపేట, సూర్యన్యూస్: 
దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు జిల్లా ఎస్పీ డాక్టర్ జి. వినీత్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... నారాయణపేట జిల్లా పరిధిలో మొత్తం 226 దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని అట్టి నేపథ్యంలో ప్రజలంతా ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరఫున అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రతి దుర్గామాత మండపం వద్ద నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, కనీసం ఇద్దరు బాధ్యతగల వ్యక్తులు 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని సూచించారు. మండపాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ పాయింట్ బుక్స్‌లో పోలీసులు తనిఖీల వివరాలు నమోదు చేసే సమయంలో నిర్వాహకులు సహకరించాలని కోరారు. మండపాల వద్ద వాలంటీర్లు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా లేదా అపరిచిత వ్యక్తులు సంచరిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. మండపాలు, కాలనీల పరిసర ప్రాంతాల్లో నిరంతర పోలీస్ పెట్రోలింగ్, బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
దుర్గామాత దర్శనానికి వచ్చే భక్తులకు, ముఖ్యంగా మహిళలు, యువతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన క్యూలైన్లు ఏర్పాటు చేయాలని ఎస్పీ సూచించారు. మండపాల వద్ద విద్యుత్ వైర్లు కిందకు వేలాడకుండా చూసుకోవాలని, షార్ట్ సర్క్యూట్, అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అగ్నిప్రమాద నివారణలో భాగంగా ప్రతి మండపం వద్ద రెండు బకెట్ల నీరు, రెండు బకెట్ల ఇసుక అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో టపాసులు కాల్చడం నిషేధమని, డీజేలకు ఎలాంటి అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. తక్కువ శబ్దంతో కూడిన లౌడ్‌స్పీకర్లను మాత్రమే వినియోగించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రాత్రి 10 గంటలలోపు లౌడ్‌స్పీకర్లను పూర్తిగా నిలిపివేయాలని తెలిపారు.సోషల్ మీడియాలో మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా, ఇతరులను రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టడం, అనవసరమైన సమాచారాన్ని షేర్ చేయడం చేయరాదని ఎస్పీ హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారమయ్యే అసత్య, నిరాధార వార్తలను ప్రజలు నమ్మవద్దని, వాటిని ఇతరులకు పంపించవద్దని సూచించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై నిఘా ఉంటుందని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా, అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించినా వెంటనే డయల్ 112కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ కోరారు. ప్రజలు, మండపాల నిర్వాహకులు, వాలంటీర్లు పోలీస్ శాఖకు సహకరించి దేవీ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా విజయవంతం చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.