BREAKING
29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ...... నగరంలో కూటమి ప్రచార బేరి

చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసం హేయమైన చర్య

Select Suryaa Now
చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసం హేయమైన చర్య

లింగాలఘణపూర్, మేజర్ న్యూస్, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బహుజన ఆత్మగౌరవ ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మెదక్ పట్టణంలో దుండగులు కూల్చివేయడం అత్యంత హేయమైన చర్య అని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య తీవ్రంగా ఖండించారు. ఈ దుశ్చర్యకు నిరసనగా సోమవారం లింగాలఘణపురం మండల కేంద్రంలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, బిఆర్ఎస్ శ్రేణులు, రజక సంఘం నాయకులు కలసి చాకలి ఐలమ్మ విగ్రహానికి క్షీరాభిషేకం (పాలాభిషేకం) నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం దుండగుల చర్యను నిరసిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం గళమెత్తిన వీరవనిత ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడం యావత్ తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ విగ్రహాలను కూల్చివేస్తున్న సంఘవిద్రోహ శక్తులను పోలీసులు తక్షణమే అరెస్టు చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెదక్‌లో కూల్చివేసిన ఐలమ్మ విగ్రహాన్ని ప్రభుత్వమే తన పూర్తి ఖర్చులతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పునర్నిర్మించాలని కోరారు.పేదలు, బహుజనుల ఆత్మగౌరవాన్ని కాపాడే పోరాటాల్లో, ఐలమ్మ ఆశయాల సాధనలో రజకులు ఎల్లప్పుడూ ముందుంటారని నాయకులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి విద్వేషపూరిత ఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఇంచార్జ్ చౌదర్పల్లి శేఖర్, స్థానిక సర్పంచ్ ఎడ్ల లావణ్య రాజు, వడిచర్ల సర్పంచ్ చెరుకు కార్తీక్, ఉప సర్పంచ్ గట్టగల్ల రాజయ్య, మాజీ ఎంపీటీసీ గండి యాదగిరి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఎదునూరి వీరన్న, గ్రామ శాఖ అధ్యక్షులు కేమిడి యాదగిరి, దూసరి వెంకన్న, లింగాల వెంకటేష్, గట్టగల్ల శ్రీహరి, గండి చంద్రశేఖర్, కేమిడి రాజు, బండ్రు సత్తయ్య, గట్టగల్ల నాగరాజు, వేముల శ్రీను, ఎడ్ల తిరుపతి, బాల్య సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు,రజక సంఘం ప్రతినిధులు, ఎంఆర్‌పీఎస్ నాయకులు, బీఆర్‌ఎస్ శ్రేణులు, స్థానిక సర్పంచ్‌లు, వివిధ ప్రజాసంఘాల బాధ్యులు మరియు మండల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని తమ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించారు.

రిపోర్టర్, కార్తీక్ ,లింగాలఘనపూర్, జనగామ జిల్లా