బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పెద్ద పీఠ • గవర్నర్ కొటాలో నీలం మధుకు ఎమ్మెల్సీ ఇవ్వాలి • ఎన్ఎంఆర్ ఇంచార్జీ బొయిని రవి ముదిరాజ్
జహీరాబాద్;అన్నా అంటే నేనున్నానంటూ ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పలు సేవ కార్యక్రమాలు, పేదలకు నేనున్నానని దైర్యం చెబుతున్న మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ నీలం మధు ముదిరాజ్ కు గవర్నర్ కొటాలో ఖాలీగా ఉన్న ఎమ్మెల్సీ పదవీ ఇవ్వాలని ఎన్ఎంఆర్ యువసేన నియోజకవర్గ ఇంచార్జీ బొయిని రవి ముదిరాజ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ కోటాలో ఖాలీగా ఉన్న ఎమ్మెల్సీ పదవి బిసి బిడ్డ సామాజిక వర్గానికి చేందిన నీలం మధు ముదిరాజ్ కు బిసి కోటాలో ఎమ్మెల్సీ పదవి కల్పించాలని, పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను, పేదలకు రేషన్ కార్డులు, 200ల యూనిట్లు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వ్యవసాయానికి సబ్సిడీ డ్రీప్, ఇందిరమ్మ ఇండ్లు తదితర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకేల్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నీలం మధు ముదిరాజ్ కు ఎమ్మెల్సీ పదవీ ఇవ్వాలని కోరారు.