BREAKING
ఇంధన సంక్షోభంపై మాక్రాన్ వ్యూహం: గల్ఫ్ దేశాల నుంచి భారీగా డీజిల్ కొనుగోలు జామ్‌నగర్ రిఫైనరీకి యూఎస్ విదేశాంగ మంత్రి: ఇంధన వ్యూహమే ప్రధాన లక్ష్యం! సౌదీ అరేబియా రక్షణకు బ్రిటన్ కీలక నిర్ణయం: రాయల్ ఎయిర్‌ఫోర్స్ టైఫూన్ యుద్ధ విమానాల మోహరింపు! ఫ్రాన్స్ హింసాత్మక అల్లర్లు: మరిన్ని నగరాల్లో కర్ఫ్యూ విధింపుపై ప్రధాని ప్రకటన ఇరాన్ పాలకుల పాలనను అంతమొందించడమే మా లక్ష్యం: నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు.. భారత్-అమెరికా బంధం: వాణిజ్యం, భద్రతపై జైశంకర్ ఉన్నత స్థాయి భేటీ ఫారమ్ 173A అంటే ఏమిటి?: ప్రభుత్వ సెక్యూరిటీలపై పన్ను మినహాయింపుల కోసం సీబీడీటీ కొత్త నిబంధనలు! MSCI హెచ్చరికలతో కుప్పకూలిన ఇండోనేషియా స్టాక్ మార్కెట్.. 2031 నాటికి హార్ముజ్ జలసంధి ప్రాధాన్యత కనుమరుగు: హెచ్‌ఎస్‌బీసీ సీఈవో పండుగల వేళ ఈ-కామర్స్ జోరు: ఫ్లిప్‌కార్ట్ యాక్టివ్ యూజర్లలో సరికొత్త రికార్డు.. బోఫా (BofA) నివేదికలో కీలక వెల్లడి! పండుగల వేళ అమెజాన్ బంపర్ రిక్రూట్‌మెంట్: 3 లక్షల మందికి పైగా నియామకాలు.. ఫ్యాక్టరీ ప్రమాదం దర్యాప్తులో షెఫ్లర్ ఇండియా సీఈవో హర్ష కదమ్‌ను అదుపులోకి తీసుకున్న పూణే పోలీసులు! నేటి పంచాంగం 21 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –21 అక్టోబర్ 2026 అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్యెల్యే ఉగ్ర నరసింహారెడ్డి

బాలికలు శక్తివంతంగా తయారు కావాలి -- నారాయణపేట సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్

Select Suryaa Now
బాలికలు శక్తివంతంగా తయారు కావాలి  -- నారాయణపేట సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్

నారాయణపేట, సూర్యన్యూస్:
బాలికలు సమాజంలో ఎంతో శక్తివంతంగా తయారు కావాలని జిల్లా లీగల్ సర్వీసెస్ సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ అన్నారు. నారాయణపేట పట్టణంలోని చిల్డ్రన్స్ హోమ్ లో జిల్లా న్యాయ సేవ సంస్థ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలికలు ఎంతో శక్తివంతంగా తయారు కావాలని, వారి హక్కులను సొంతంగా సాధించుకునే స్థాయికి ఎదగాలన్నారు.  ప్రతి బాలికకు అన్ని అంశాలు నేర్చుకోవాలని,  సురక్షితమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన అవకాశాలను సృష్టించుకోవాలన్నారు. ఈ ఒక్క విషయంలో నిరుత్సాహ పడకుండా బలవంతులుగా ఎదగాలన్నారు. లింగ విభేదాలు లేకుండా పురుషులకు సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. చట్టాలు అనేక రకాలుగా రక్షణ కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చదువు దగ్గర నుంచి ఉద్యోగం తదితర అన్ని విషయాల్లో రిజర్వేషన్ లను  రాజ్యాంగం కల్పించిందని, హక్కుగా వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం విద్యా, సమానత్వం, సంరక్షణ మరియు రక్షణ పొందే హక్కులపై వివరించారు. ఉచిత సహాయం కోసం చైల్డ్ లైన్ 1098 కు కాల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రాజేందర్ గౌడ్ ,  లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కె. లక్ష్మిపతి గౌడ్,  మీనాక్షి,  హసీనా బేగం సిడిపిఓ, శివలీల చిల్డ్రన్స్ హోమ్ సిబ్బంది  పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట