BREAKING
29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ...... నగరంలో కూటమి ప్రచార బేరి

అరేంపులలో అంగరంగ వైభవంగా సరస్వతీ పూజోత్సవం

Select Suryaa Now
అరేంపులలో అంగరంగ వైభవంగా సరస్వతీ పూజోత్సవం

ఖమ్మం రూరల్, సూర్య మేజర్ న్యూస్: ఖమ్మం రూరల్ మండలం ఆరంపుల గ్రామంలో జై దుర్గా భవాని కాకతీయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సరస్వతీ పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో సాగింది. ఈ సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భక్తులు భక్తిపారవశ్యంతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ పూజా కార్యక్రమానికి ఆరంపుల గ్రామ సర్పంచ్ బండి సతీష్ దంపతులు హాజరై కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. గ్రామంలో శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
జై దుర్గా భవాని కాకతీయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమం భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తి, విశ్వాసం, సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించిన పూజల్లో గ్రామస్తులు పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామంలో ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందించడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు దోహదపడతాయని గ్రామస్తులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జై దుర్గా భవాని కాకతీయ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.