అనారోగ్యంతో విశ్రాంత ఉద్యోగి కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి.
సబ్జెక్టు పేరుని ఇంటిపేరుగా మార్చుకున్న అధ్యాపకుడు.
కోదాడ (మేజర్ న్యూస్) అధ్యాపకుడిగా విద్యార్థులకు బోధించే సబ్జెక్టు కెమిస్ట్రీ పేరు నే తన ఇంటిపేరుగా మార్చు కొన్న విశ్రాంత అధ్యాపకుడు కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు అనారోగ్యంతో హైదరాబాదులో ఆసుపత్రి చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలియగానే ఎక్కడెక్కడో ఉన్న, వివిధ హోదాలో ఉన్న ఆయన శిష్యులు వందలాదిమంది కన్నీటి పర్వతమయ్యారు. ఆయన చెప్పే సబ్జెక్టులో ఎవరికి మార్పులు తక్కువ వచ్చిన చెవ్వు మేలేసి, బెత్తం తో కొడుతూ తల పైన మొట్టికాయలు వేసేవాడని పలురు శిష్యులు గుర్తు చేసుకున్నారు. విద్యార్థులను సక్రమార్గంలో పెట్టడంలో, సరైన బోధన అందించడంలో కెమిస్ట్రీ వెంకటేశ్వరావుకు ప్రత్యేక గుర్తింపు గౌరవం లభించింది. ఆ గుర్తింపు ఆ మంచితనం తోనే చనిపోయే వరకు కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు గానే పిలవబడ్డాడు. ఆ పేరు ఎప్పటికీ మర్చిపో నీ విధంగా ఆయన శిష్యులలో కోదాడ పట్టణ ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇప్పటికీ ఆయన అసలు ఇంటి పేరు చాలామందికి తెలియదు. కేఆర్ డిగ్రీ కళాశాలలో సుదీర్ఘంగా పనిచేసిన ఆయన సుమారు10 సంవత్సరాల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. ఆయనను విశ్రమించకుండా తన కుమారుడు మాదాల శ్రీధర్ స్థాపించిన శ్రీవిద్య, కవిత కళాశాలలో 10 సంవత్సరాల కు పైగా కెమిస్ట్రీ లెక్చరర్ గా పని చేస్తూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చరవాణి ద్వారా సంతాపం తెలిపారు. అదేవిధంగా మాజీ ప్రజా ప్రతినిధులు పట్టణ ప్రముఖులు పబ్లిక్ క్లబ్ సభ్యులు పలువురు ఆయన శిష్యులు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు. ఆయన సతీమణి సంవత్సరం క్రితమే మృతి చెందారు.
ఆయనకు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు.