అమ్మవారి మండపాలను సందర్శించిన లక్ష్మణ్‌గౌడ్
అల్లాపూర్, మేజర్‌న్యూస్ :దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అల్లాపూర్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు లక్ష్మణ్‌గౌడ్ అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పలు మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వినాయకరావు నగర్‌లోని వినాయకరావు నగర్ యూత్ అసోసియేషన్ సభ్యులు దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అక్కినాపురం లక్ష్మణ్ గౌడ్ ప్రతేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే అల్లాపూర్ డివిజన్ 255 లోని సఫ్దార్‌నగర్ ఇ బ్లాక్‌లో దేవి నవరాత్రులలో భాగంగా దుర్గమాత మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అక్కినాపురం లక్ష్మణ్ గౌడ్ ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కృష్ణమరాజు, వేణుగోపాల కృష్ణ, రాఘవేంద్ర స్వామి, అప్పల రాజు, అప్పల స్వామి యూత్ కమిటీ సభ్యలు పాల్గొన్నారు.