అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి
కొల్చారం ..మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో హనుమాన్ టెంపుల్ శ్రీ దుర్గాభవాని కమిటీ, పోచమ్మ ఆలయం వద్ద శ్రీ భవాని కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాభవాని అమ్మవారిని ఆదివారం నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో అమ్మవారి ఆశీస్సులతో ప్రజల కష్టాలు, విఘ్నాలు తొలగిపోవాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలతో గ్రామాలు సుభిక్షంగా వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఇరు కమిటీల సభ్యులు ప్రతి సంవత్సరం ఇదే విధంగా అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరారు.అనంతరం ఆవుల రాజిరెడ్డిని ఇరు కమిటీల సభ్యులు శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్, ఉపాధ్యక్షుడు ముత్యంగారి గోవర్ధన్, అచ్చనపల్లి శ్రీరాములు, విజయ్ గౌడ్, చంద్రం, మల్లేశం, మాజీ ఎంపీటీసీ రామకిష్టయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.