BREAKING
అసత్యంపై ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది: ద్వారక దసరా వేడుకల్లో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం! భారత విమానయాన రంగంలో రికార్డుల ప్రస్థానం: 2047 నాటికి 130 కోట్ల ప్రయాణికులే లక్ష్యం.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి! సంపద, విజ్ఞానం, శక్తి కలబోసిన భారత్‌గా తీర్చిదిద్దడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం: తజికిస్తాన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టీకరణ! కొద్ది వారాల్లోనే భారత్-అమెరికా చారిత్రక వాణిజ్య ఒప్పందం: యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన ప్రకటన! ఉగ్రవాదంపై మా భాగస్వామ్య దేశాలు జీరో టాలరెన్స్ చూపించాలి: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ.. తహవ్వుర్ రాణా అప్పగింతపై హర్షం! 'ఉడాన్' పథకానికి పదేళ్లు: దేశవ్యాప్తంగా 1.72 కోట్ల మందికి విమాన ప్రయాణం.. 687 రూట్లతో సామాన్యుడి సొంతమైన ఆకాశం! భారత్-న్యూజిలాండ్ చారిత్రక వాణిజ్య ఒప్పందం అమలు.. ఇరుదేశాల హర్షం! హరిహర క్షేత్రంలో ఘనంగా శమి పూజలు 2029 డిసెంబర్ 31 నాటికి పంజాబ్‌ను ‘నశా ముక్త్’గా మారుస్తాం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టమైన డెడ్‌లైన్! ఎన్నికలు రాగానే పంజాబ్ గుర్తొచ్చిందా?: అమిత్ షాపై భగవంత్ మాన్ ధ్వజం! కాలనేమి కూడా రాముడి నామాన్ని జపించేవాడు: అయోధ్యపై విపక్షాల దుష్ప్రచారంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర వ్యాఖ్యలు! మహారాష్ట్రలో ప్రభుత్వం మారాల్సిందే: దసరా ర్యాలీలో బీజేపీపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ధ్వజం! అమెరికాలో 3 లక్షల వీసాల రద్దు.. నేరస్థులపై ఉక్కుపాదం! పాకిస్తాన్, సౌదీ అరేబియాతో చారిత్రక 'మక్కా రక్షణ ఒప్పందం': ధ్రువీకరణ కోసం పార్లమెంటుకు పంపిన టర్కీ ప్రభుత్వం! ఇంధన సంక్షోభంపై మాక్రాన్ వ్యూహం: గల్ఫ్ దేశాల నుంచి భారీగా డీజిల్ కొనుగోలు

అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి. - ధ్రువీకరణ పత్రాల పరిశీలన పకడ్బందీగా నిర్వహించాలి. - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

Select Suryaa Now
అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి. - ధ్రువీకరణ పత్రాల పరిశీలన పకడ్బందీగా నిర్వహించాలి. - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
సూర్య నిర్మల్ ప్రతినిధి. :నిర్మల్ జిల్లాలో 89 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ మండలాల వారీగా అందిన దరఖాస్తుల వివరాలు, అర్హతల పరిశీలన, ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అంగన్వాడీ టీచర్ల భర్తీ ప్రక్రియలో అర్హత కలిగిన అభ్యర్థులకు న్యాయం జరిగేలా నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, ప్రతి దశను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. దరఖాస్తుదారులు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను పకడ్బందీగా పరిశీలించాలని, ఎలాంటి సందేహాలకు అవకాశం లేకుండా అవసరమైన స్థాయిల్లో పత్రాలను మరోసారి ధ్రువీకరించుకోవాలని ఆదేశించారు. భర్తీ ప్రక్రియకు సంబంధించిన సమాచారం, తదుపరి దశల వివరాలను దరఖాస్తుదారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. మండల, గ్రామ స్థాయిల్లో సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అర్హత పత్రాల పరిశీలనను పూర్తి చేయాలని తెలిపారు. అంగన్వాడీ టీచర్ల భర్తీ ప్రక్రియ పూర్తిగా నిబంధనల ప్రకారమే, పారదర్శకంగా జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, భర్తీ చేయిస్తామని చెప్పే వ్యక్తులకు ఎలాంటి డబ్బులు చెల్లించవద్దని ఆయన సూచించారు. భర్తీ ప్రక్రియకు సంబంధించి అధికారిక సమాచారం మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.ఈ సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి వినూత్న, సీడీపీవోలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.