BREAKING
ఆఫీలియేషన్ 5 సం లకు ఒకసారి ఇవ్వాలి అభివృద్ధిని గెలిపించండి ‎వచ్చే నెలలోనే చింతలపూడి పనులు ప్రారంభం.. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 2027 ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడుతారా.. బీసీసీఐ చీఫ్ కీలక వ్యాఖ్యలు! ఘనంగా పిడికిటి గోపాల్ చౌదరి జన్మదిన వేడుకలు సోషల్ మీడియా వారియర్ పిడికిటి గోపాల్ చౌదరి జన్మదినం శనీశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు అమరవీరుల త్యాగాలు మరువలేనివి కాంగ్రెస్ వైఫల్యాలకు తగిన సమాధానం చెప్పాలి పట్టభద్రుల ఎన్నికల పై ఎం.జి.ఆర్. సూచన వేడుకగా శ్రీవారి ఎదుర్కోలు ఉత్సవం రక్తదాన శిబిరం పాకిస్తాన్ టెస్ట్ జట్టు ప్రకటన.. శ్రీలంక సిరీస్‌కు కొత్త ఆటగాళ్లకు పిలుపు దేవరపల్లిని ఆదర్శ గ్రామం గా తీర్చిదిద్దుతా శిల్పా రావుకు అవమానం.. లైవ్ స్టేజ్‌పై మధ్యలోనే పాట ఆపేయడంతో మండిపడుతున్న ఫ్యాన్స్! పెరవలిలో ఎన్నికల వేడి.. 20 ఎంపీటీసీ స్థానాలకు 102 నామినేషన్లు! అత్యధికంగా వైసీపీ నుంచి 39 నామినేషన్లు.. బానసంధ్య దుకాణాలు తనిఖీ చేసిన డిఎస్పి

అండర్ డ్రైనేజ్ పనులను ప్రారంభించిన సబితా ఇంద్రారెడ్డి

Select Suryaa Now
అండర్ డ్రైనేజ్ పనులను ప్రారంభించిన సబితా ఇంద్రారెడ్డి

అండర్  డ్రైనేజీ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.     

                             జల్ పల్లి :  జిహెచ్ఎంసి జల్ పల్లి సర్కిల్, 65వ డివిజన్ మరాఠా భవన్ సమీపంలో ఉన్న అద్నాన్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణ పనులకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం పహాడీ షరీఫ్ 64వ డివిజన్ ఉస్మాన్ నగర్, హబీబ్ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యల, శాశ్వత పరిష్కారం కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ పనులను ఆమె ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న సబితమ్మకు స్థానిక ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ. కాంగ్రెస్ అసమర్థ పాలనతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కష్టాలను గ్రహించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. రాబోయే ఎండాకాలంలో నీటిని ప్రజలు తక్కువ వాడుకోండి అని చెప్పడం కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం తాగునీటి ఎద్దడి తలెత్తకుండా బాధ్యత వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జల్ పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్, డిఈ, ఏఈ, జల్ పల్లి బిఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.    

          అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.