అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ప్రవేశాల గడువు 13 వరకు పొడిగింపు
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ప్రవేశాల గడువు 13 వరకు పొడిగింపు
మహాదేవపూర్, అక్టోబర్ 1 మేజర్ సూర్య న్యూస్:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించినట్లు మహాదేవపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జన్ను విజయ్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహాదేవపూర్ స్టడీ సెంటర్ (కోడ్: 243) పరిధిలో ఉన్న ఆన్‌లైన్ విధానం ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు, గృహిణులు, మధ్యలో చదువు ఆపేసిన వారు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు అంగన్వాడీ టీచర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంటర్మీడియట్, డిప్లొమా లేదా తత్సమాన అర్హత ఉన్నవారు తమకు ఆసక్తి ఉన్న కోర్సుల్లో చేరవచ్చని తెలిపారు.
అభ్యర్థులు గడువు తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా వివరాలు సమర్పించి, రుసుము చెల్లించి ప్రవేశ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. సమాచారం లేదా సందేహాల కోసం స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజును 9849403237 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చని తెలిపారు.