BREAKING
ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ...... నగరంలో కూటమి ప్రచార బేరి ఓటమి భయంతోనే విధ్వంస రాజకీయాలు -రూ.4.75 కోట్ల రోడ్డును అర్ధరాత్రి ధ్వంసం - ఇది అభివృద్ధిపై దాడి కాదా? -పులివెందుల పులి తోక కట్-నీ ఇలాకా కూడా కూటమి వశమే జగన్ టాబ్లెట్లు వేసుకోకుండా ఎవరిని సస్పెండ్ చేస్తాడో? వైసీపీపై కిరణ్ రాయల్ సంచలన ధ్వజం

అక్టోబర్ 6న చలో ఉస్మానియా ను విజయవంతం చేయండి

Select Suryaa Now
అక్టోబర్ 6న చలో ఉస్మానియా ను విజయవంతం చేయండి

అక్టోబర్ 6న చలో ఉస్మానియా కు మాదిగ విద్యార్థులు తరలిరావాలి. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు: యాసం రమేష్ మాదిగ.

వెంకటాపురం నూగూరు/ సెప్టెంబర్ 30 (మేజర్ న్యూస్ సూర్య): అక్టోబర్ 6న ఉస్మానియా యూనివర్సిటీలో జరగనున్న ఎంఎస్ఎఫ్ బహిరంగ సభను మండలంలోని మాదిగ విద్యార్థులు అత్యంత ఉత్సాహంతో పాల్గొని విజయవంతం చేయాలని ములుగు జిల్లా వెంకటాపురం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు యాసం రమేష్ మాదిగ పిలుపునిచ్చారు.మంగళవారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మన కోసం, మన బంగారు భవిష్యత్తు కోసం బాట వేసిన మాదిగ జాతి జననేత, మరో నవ అంబేద్కర్ పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ  ప్రతి అడుగులో ఆయన మార్గంలో నడుద్దామని, కుల రహిత సమ సమాజం కోసం ప్రయాణం చేద్దామని ఆయన అన్నారు.మూడు దశాబ్దాలుగా అలుపెరగని పోరు సాగించి రిజర్వేషన్ ఫలాలను నేడు మన ముంగిట నిలిపిన మహోత్తర పోరాట యోధుడు మంద కృష్ణ మాదిగ పిలుపు అందుకొని జాతి విద్యార్థి ఉద్యమంలోకి ఉరకలెత్తే ఉత్సాహంతో తరలిరావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు యాసం మహేష్ మాదిగ, కోగిల మల్లికార్జున్ మాదిగ, వేల్పుల మల్లేష్ మాదిగ, తోకల అంజి మాదిగ, కోగిల సృజన్ మాదిగ, గుద్దేటి నాగరాజు మాదిగ, కోగిల ఆనంద్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.