*ఆడపడుచులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జారె
సూర్య అశ్వరావుపేట,తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు పల్లెల్లో పండుగ శోభను నింపుతున్నాయి దేవీ నవరాత్రుల సందర్భంగా అశ్వారావుపేట మండలం
కొత్తమామిళ్లవారిగూడెం పాతమామిళ్లవారిగూడెం గ్రామాల్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొని వారితో మమేకమయ్యారు రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు సంప్రదాయ పాటలు పాడుతూ ఆటలాడుతూ ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు ఎమ్మెల్యే వారితో కలిసి సంబరాల్లో పాల్గొనడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం మరింత సందడిగా మారింది తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు ప్రకృతి ఆరాధనకు పూల పండుగ వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించే గొప్ప వేడుక అని ఈ సందర్భంగా పండుగ ప్రాధాన్యతను చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వగ్గెల లక్ష్మణరావు ఉప సర్పంచ్ వీర్నాల శ్రీనివాసరావుకాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట