BREAKING
సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో గంజాయిపై ఉక్కుపాదం**గడిచిన ఏడాదిలో 20 మందిని అరెస్టు చేశాం* మైక్రోసాఫ్ట్ సేవల్లో ప్రపంచవ్యాప్త అంతరాయం: ఔట్‌లుక్, మైక్రోసాఫ్ట్ 365 డౌన్ కావడంతో వినియోగదారుల అవస్థలు బైనాన్స్ క్రిప్టో దొంగతనం కేసులో FBI భారీ స్వాధీనం: కోట్లాది రూపాయల క్రిప్టోకరెన్సీ రికవరీ ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ వన్డే: అరంగేట్రం మ్యాచ్‌లోనే ఆరు వికెట్లతో చెలరేగిన బార్డ్‌మాన్, 131 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్ అధిక ఫీజుల వసూళ్లపై మండల విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్‌తో అమెరికా ప్రతినిధుల కీలక చర్చలు: శాంతి ఒప్పందం దిశగా అడుగులు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సామాజిక న్యాయ ఛాంపియన్ః మంత్రి సీతక్క ఘనంగా భగవాన్ బిర్షముండా 151 వ జయంతి వేడుకలు స్వయంకృత అపరాధంతో ప్రపంచకప్ టికెట్ చేజార్చుకుంటున్న కుల్దీప్ యాదవ్.. కివీస్‌తో మ్యాచ్‌లో చెత్త ప్రదర్శనపై ట్రోల్స్ తైవాన్ చుట్టూ చైనా భారీ సైనిక విన్యాసాలు: 100కు పైగా యుద్ధనౌకల మోహరింపు.. తీవ్ర ఉద్రిక్తత ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ వన్డేలో అద్భుతం.. 38 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన యువ పేసర్ మహ్లీ బార్డ్‌మాన్ నషా ముక్త్ భారత్ అభియాన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ రాజర్షి షా 30 ఏళ్ల గ్రామస్తుల కష్టం.. అధికారుల మౌనం --గ్రామ చందాలతో కొనుగోలు చేసిన ఎకరం భూమికి బోర్డు వివాదం.. --ఉన్నతాధికారుల లేఖలకూ స్పందన కరువు.. -+8 నెలలుగా పరిష్కారానికి నోచుకోని సమస్య.. --సొంత పాఠశాలలోనే వివాదాన్ని చక్కదిద్దలేని ఎంఈఓ తీరుపై గ్రామస్తుల అసహనం కివీస్‌తో నాలుగో వన్డేలో టీమిండియా చిత్తు.. 244 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసిన భారత్ మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్

ఒకేచోట.. సర్కారు కొలువు!

Select Suryaa Now
ఒకేచోట.. సర్కారు కొలువు!

దేవరకొండ ప్రతినిధి నవంబర్ 13:(మేజర్ న్యూస్ )

ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రజల కష్టాలకు తెరదించడంతో పాటు, అన్ని ప్రభుత్వ శాఖల సేవలను ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో దేవరకొండలో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నిర్మాణానికి కార్యాచరణ మొదలైంది. ఇందుకోసం సుమారు రూ.25 కోట్ల నిధులతో చేపట్టనున్న ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణానికి సంబంధించి శుక్రవారం ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన నిర్వహించారు.పట్టణంలోని 18వ వార్డు పరిధిలో, పోలీస్ స్టేషన్ సమీపాన ఉన్న ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ పక్కన ప్రతిపాదిత స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. దేవరకొండ ఆర్డీవో, తహసీల్దార్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులతో కలిసి స్థల పరిస్థితులను సమీక్షించారు. భవన నిర్మాణానికి స్థలం ఎంతవరకు అనుకూలంగా ఉంది? అవసరమైన మౌలిక వసతులు ఎలా ఉన్నాయి? ప్రజలు సులభంగా చేరుకునేందుకు రవాణా సౌకర్యాలు ఎలా ఉంటాయి? అనే అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

 

ఒకే ప్రాంగణంలో.. అన్ని సేవలు!

ప్రస్తుతం వివిధ ప్రభుత్వ పనుల నిమిత్తం ప్రజలు ఒక్కో శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి తిరగడం వల్ల సమయం, ప్రయాణ ఖర్చులు వృథా అవుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఒకే రోజు తమ పనులన్నీ పూర్తి చేసుకోవడం ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అందుబాటులోకి వస్తే వివిధ శాఖల సేవలు ఒకే ప్రాంగణంలో పొందే అవకాశం కలుగుతుంది. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావడంతో పాటు ప్రభుత్వ సేవల్లో వేగం పెరిగే అవకాశం ఉంటుంది.

నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలి

ప్రజలకు మెరుగైన పరిపాలన, సత్వర ప్రభుత్వ సేవలు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే బాలు నాయక్ పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల సముదాయం నిర్మాణం పూర్తయితే దేవరకొండ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. నిర్మాణానికి సంబంధించి అవసరమైన తదుపరి చర్యలను వేగవంతం చేయాలని, స్థల పరిశీలన అనంతరం చేపట్టాల్సిన ప్రక్రియపై అధికారులు సమగ్రంగా దృష్టి సారించాలని సూచించారు.దేవరకొండ పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే వేదికపైకి వస్తే పరిపాలనా సౌలభ్యం పెరగడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలవుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ స్థల పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న వెంకటేశ్వర్లు, ఆలంపల్లి నర్సింహా, హనుమంతు వెంకటేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ రయీస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మారుపాకుల సురేష్ గౌడ్, వడ్త్యా దేవేందర్ నాయక్, లోకసాని శ్రీధర్ రెడ్డి, వై.ఎస్. కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు