BREAKING
నేడు దస్తగిరి స్వామి గ్యార్మీ వేడుకలు ఫిఫా అంతర్జాతీయ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో స్పెయిన్ దూకుడు అద్దంకిలో తాగునీటి సరఫరా వేళల్లో మార్పులు. నెట్‌ఫ్లిక్స్‌లో పరిణీతి చోప్రా ‘రిపోర్టింగ్ లైవ్’ మూవీ రివ్యూ.. కథ బాగున్నా థ్రిల్ మిస్ అయిందా? మానసిక ఆరోగ్యంపై రాజమహేంద్రవరం జీఎంసీలో అవగాహన సదస్సు, ర్యాలీ ప్రజాసేవ నుంచి పంచాయతీ పీఠం దిశగా ఏలూరి మాధవరావు బీసీల రాజకీయ ప్రయోజనాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు: 34% రిజర్వేషన్ల కంటే ఎక్కువే ఇచ్చి గెలిపించుకుంటాం! వైసీపీ గుర్తింపు కార్డుల పేరుతో కార్యకర్తలను మోసం చేస్తున్నారు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై బండి పరశురామ్ విమర్శలు బీసీలకు జరిగిన అన్యాయంపై జగన్ సమాధానం చెప్పాలి 34 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై వైసీపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ జిల్లా కలెక్టరేట్‌లో దిశ కమిటీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నోయిడా జేవర్ ఎయిర్‌పోర్ట్‌కు నరేంద్ర మోదీ పేరు: యూపీ కేబినెట్ కీలక నిర్ణయం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించాలని రైతుల విజ్ఞప్తి. ఓటీటీలోకి ఇమ్రాన్ హష్మీ బ్లాక్‌బస్టర్ మూవీ ‘అవారాపన్ 2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? విదేశీయుల వసతి వివరాలు 24 గంటల లోపు ఆన్లైన్లో నమోదు చెయ్యాలి మరియు FRRO / FRO ఆఫీసు కు పంపించాలి-జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ 'షార్క్ ట్యాంక్' బ్రాండ్‌లో స్టార్ హీరో వరుణ్ ధావన్ పెట్టుబడులు.. పీవీ సింధుతో కలిసి బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం!

వ్యవసాయ కుంటల నిర్మాణంతో రైతులకు మేలు

Select Suryaa Now
వ్యవసాయ కుంటల నిర్మాణంతో రైతులకు మేలు

సూర్య వాంకిడి, : వర్షపు నీటిని సంరక్షించుకోవడం ద్వారా వ్యవసాయానికి మేలు చేకూరుతుందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బానోత్ దత్తారాం అన్నారు. శుక్రవారం వాంకిడి మండలంలోని గొయెగావ్‌ గ్రామపంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న వ్యవసాయ కుంటల పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నందున రైతుల పొలాల్లో నీటి సంరక్షణ పనులను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. వ్యవసాయ కుంటల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకుని పంటలకు అవసరమైన సమయంలో వినియోగించుకోవచ్చన్నారు. తద్వారా పంటల దిగుబడులను పెంచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ పనుల వల్ల గ్రామాల్లో శాశ్వత ఆస్తులు ఏర్పడటంతోపాటు పేద కూలీలకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో జాబ్‌ కార్డులు కలిగిన వారంతా అందుబాటులో ఉన్న పనులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అనంతరం వాంకిడి గ్రామపంచాయతీలో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల అర్హతలను పరిశీలించి, వారి వివరాలను ధ్రువీకరించారు.తదుపరి మండల పరిషత్‌ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజల సౌకర్యార్థం రూ.3 లక్షల వ్యయంతో నిర్మించనున్న సామూహిక మరుగుదొడ్లకు స్థానిక సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లతో కలిసి భూమిపూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి పాటిల్‌ జ్యోత్స్న, ఇంజినీరింగ్‌ అధికారి మోసిన్‌ బిన్‌ అహ్మద్‌, సాంకేతిక సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.