వట్టిపల్లి మండల ఏర్పాటు వెనుక, కాంగ్రెస్ నాయకుల పోరాటం కీలకం.
వట్టిపల్లి, ; మండలం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ పాపమ్మ మాణిక్య గౌడ్, మండల మాజీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వీరారెడ్డి, మాజీ సర్పంచ్ పి.సంగారెడ్డి పూర్వ జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. వట్టిపల్లి చౌరస్తాలో సుమారు 28 రోజులు రిలే నిరాహార దీక్షలు , చేపట్టినారు. 17 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జైల్ పాలు ఐనారు. నేటి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నూతన మండలం ఏర్పాటుకు సంఘీభావం తెలిపి, రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.చలించిన మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు అక్టోబర్ 11, 2016 నాడు వట్పల్లిని నూతన మండలముగా ఏర్పాటు చేస్తున్నామని అధికారికంగా ప్రకటించినారు. అందోల్- జోగిపేట డివిజన్ లో కలిపినారు. ఎం ఎస్ యు ఐ నాయకుడు కాజా మాట్లాడుతూ! నేడు వట్టిపల్లి పరిసర గ్రామాలు ఆర్థికంగా, సామాజికంగా ఎంతో అభివృద్ధి సాధించడం సంతోషదాయకం అన్నారు. ఆత్మ కమిటీ అధ్యక్షులు కచూర్ రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు విశ్వాస్ మాట్లాడుతూ! కాంగ్రెస్ పార్టీ నాయకుల కృషి, పోరాటాలు, త్యాగాలను విస్మరించరాదు అన్నారు. ఈ కార్యక్రమంలో పి సంగారెడ్డి ,మాణిక్య గౌడ్, కాజా, ఆత్మ కమిటీ అధ్యక్షులు కచూర్ రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు విశ్వాస్ మొదలగు వారు పాల్గొన్నారు.