త్వరలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
కొండాపూర్ ; మండల పరిధిలోని రేషన్ కార్డుదారులందరికీ త్వరలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు హరిదాస్ పూర్ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రేషన్ డీలర్ నర్సింహులు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు పంపిణీ చేసిందని, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగలేదని పేర్కొన్నారు. పేదలకు రేషన్ కార్డు ఎంతో కీలకమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఆరోగ్యశ్రీ వంటి పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఇది అవసరమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తోందని తెలిపారు. త్వరలో మండలవ్యాప్తంగా అర్హులైన రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ చేపట్టనున్నట్లు నర్సింహులు వెల్లడించారు.