తుక్కాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
తుక్కాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
గ్రామ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో
కొల్చారం : .కొల్చారం మండలంలోని తుక్కాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు ఉప సర్పంచ్ ఆర్య రవీందర్ ల ఆధ్వర్యంలో సింధు హాస్పిటల్ హైటెక్ సిటీ హైదరాబాద్ వారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సర్పంచ్ శిబిరాన్ని ప్రారంభించారు. సింధు హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ పర్యవేక్షణలో గైనకాలజిస్ట్, కార్డియాలజిస్ట్, బిపి, షుగర్, గుండె, క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు తో సహా 134 మంది గ్రామీణులు పరీక్షలు చేయించుకున్నారని మార్కెటింగ్ మేనేజర్ అన్నారు.గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మెరుగైన చికిత్స అవసరమైన వారిని సింధు హాస్పిటల్ కు రెఫర్ చేశారు. ఆసుపత్రి చైర్మన్ బండి పార్థసారధి రెడ్డి ఆధ్వర్యంలో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందించనున్నట్లు ఆయన అన్నారు. శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన వైద్యులు, ఆసుపత్రి సిబ్బందిని గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ లు అభినందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.