శ్రీ గణేష్ దేవస్థానం హుండీ లెక్కింపు
శ్రీ గణేష్ దేవస్థానం హుండీ లెక్కింపు
రూ.36.28 లక్షల ఆదాయం.. భక్తుల విశేష స్పందన
పటాన్‌చెరు : పటాన్‌చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలోని శ్రీ గణేష్ దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఆలయ హుండీ ద్వారా వచ్చిన కానుకలను లెక్కించగా రూ.35,17,163/- ఆదాయం సమకూరింది.అదేవిధంగా ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదానం హుండీ ద్వారా రూ.1,11,149/- ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఎన్. లావణ్య తెలిపారు. దీంతో హుండీ మరియు అన్నదానం హుండీ ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ.36,28,312/-గా నమోదైంది.హుండీ లెక్కింపు కార్యక్రమం దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ మీ. రంగారావు పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్. లావణ్య, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, భక్తులు, ఆలయ సిబ్బంది, సేవా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.ఆలయానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాలు మరియు భక్తుల సౌకర్యాల కోసం వినియోగించనున్నట్లు ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.