BREAKING
గోడౌన్ల వద్ద ప్రతిష్ట భద్రతా చర్యలు --- కలెక్టర్ మూలస్థానేశ్వరాలయంలో ప్రదోషకాల పూజ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో వైభవంగా ప్రదోష కాల పూజ నేడు సీఎం కు ‘ఆర్యదాన్ ముహమ్మ‌ద్‌’ అవార్డు ప్రదానం శ్రీ రాజరాజేశ్వరి ఆలయ ఈవోగా నూతలపాటి శ్రీధర్ నాయుడు సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 సన్నాహాలు: రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతీయ సదస్సుల నిర్వహణకు సీఎం చంద్రబాబు ఆదేశం నెల్లూరు అపోలో హాస్పిటల్లోఅరుదైన శస్త్రచికిత్స===700 గ్రాముల బరువుతో జన్మించిన నవజాత శిశువు నారాయణ మెడికల్ కాలేజీలో ఘనంగా 57వ ఎన్‌ఎస్‌ఎస్ ఫౌండేషన్ డే ఉత్తరాఖండ్‌లో భూ కుంభకోణాలపై ఉక్కుపాదం: ఎనిమిది కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లకు గర్హ్వాల్ డివిజన్ కమిషనర్ ఆదేశం త్వరలోనే కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలపై జీవో--- వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తమిళనాడులో ఐపీఎస్ అధికారుల స్వల్ప బదిలీ: శాంతిభద్రతల విభాగంలో కీలక మార్పులు తాడేపల్లిగూడెం సందర్శించిన ఎమ్మెల్యే బలిశెట్టి కలెక్టర్ నాగరాణి దేశవిదేశాల్లో ఘనంగా ఆయుర్వేద దినోత్సవం: 'ఆయుష్ విజన్ 2030' నివేదికను ఆవిష్కరించిన కేంద్రం కూకట్‌పల్లి జ్యువెల్ హైట్స్‌లో వైభవంగా వినాయక నిమజ్జనం.. లడ్డు, లక్ష్మీ మాల, పంచ కండువాకు భారీ వేలం వైట్‌హౌస్ స్టేట్ డిన్నర్‌లో చైనా-అమెరికా వంటకాల కలబోత: షీ జిన్‌పింగ్ కోసం ప్రత్యేక విందు సిద్ధం చేసిన మెలానియా

శంకర్‌పల్లి ‘కే రాజా’ నిమజ్జనోత్సవానికి హాజరైన నందమూరి దీపికా జానకిరామ్

Select Suryaa Now
శంకర్‌పల్లి ‘కే రాజా’ నిమజ్జనోత్సవానికి హాజరైన నందమూరి దీపికా జానకిరామ్

 

శంకర్‌పల్లి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 24) : భవానీ నగర్ యూత్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించిన “శంకర్‌పల్లి కే రాజా” గణపతి నిమజ్జన మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా సాగింది. ఈ కార్యక్రమానికి ఎన్.జే.ఆర్ (NJR) ట్రస్ట్ చైర్‌పర్సన్ శ్రీమతి నందమూరి దీపికా జానకిరామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.శంకర్‌పల్లికి చేరుకున్న ఆమెకు భవానీ నగర్ యూత్ సభ్యులు, నిర్వాహకులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత మంగళహారతులు ఇచ్చి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు.ఈ సందర్భంగా నందమూరి దీపికా జానకిరామ్ మాట్లాడుతూ… ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలను నిర్వహించిన భవానీ నగర్ యూత్ టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గ్రామాభివృద్ధి, సేవా కార్యక్రమాల్లో యువత ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భవానీ నగర్ యూత్ కమిటీ ప్రతినిధులు, NJR ట్రస్ట్ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.