నెల్లూరు అపోలో హాస్పిటల్లోఅరుదైన శస్త్రచికిత్స===700 గ్రాముల బరువుతో జన్మించిన నవజాత శిశువు
నెల్లూరు అపోలో హాస్పిటల్లోఅరుదైన శస్త్రచికిత్స
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్
అత్యంత సంక్లిష్టమైన వైద్య పరిస్థితులను అధిగమించి, కేవలం 700 గ్రాముల బరువుతో జన్మించిన నవజాత శిశువుతో పాటు తల్లిని నెల్లూరు అపోలో స్పెషాలిటీ ఆసుపత్రి వైద్య బృందం విజయవంతంగా కాపాడింది. అరుదైన ‘బైకార్నుయేట్ యుటెరస్’ (రెండు భాగాలుగా ఉండే గర్భాశయం) సమస్యతో బాధపడుతున్న 28 ఏళ్ల మహిళకు 25 వారాలకే అత్యవసర సిజేరియన్ నిర్వహించి, ఆడ శిశువుతో పాటు తల్లి ప్రాణాలను కాపాడారు.పుట్టిన వెంటనే తీవ్రమైన తక్కువ బరువుతో ఉన్న చిన్నారిని ఎన్‌ఐసీయూ లో ఉంచి అధునాతన వైద్య చికిత్స అందించడంతో పాప సంపూర్ణ ఆరోగ్య స్థితిని సాధించింది. తల్లీబిడ్డలిద్దరూ పూర్తిగా కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి క్షేమంగా డిశ్చార్జ్ చేశారు.నెల్లూరు అపోలో స్పెషాలిటీ ఆసుపత్రిలో గైనకాలజీ విభాగానికి సంబంధించి అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, అత్యంత సంక్లిష్టమైన హైరిస్క్ కేసులను కూడా విజయవంతంగా పరిష్కరించే సమర్థత కలిగిన వైద్య బృందం ఉందని డాక్టర్ లక్ష్మీ దుర్గ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అపోలో హాస్పిటల్ యూనిట్ హెడ్ విశ్వేశ్వర్ రెడ్డి, మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ రఫీ తదితరులు పాల్గొన్నారు.