BREAKING
బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ముస్తాక్ ఖాన్ కన్నుమూత! ఆత్మవిశ్వాసమే ఆయుధంగా... అంతర్జాతీయ వేదికపై 'సోముదేవుపల్లి' కుర్రాడి అద్భుతం! నాని ‘ది ప్యారడైజ్’ తొలిరోజు బాక్సాఫీస్ కలెక్షన్లు.. రికార్డు స్థాయిలో వసూళ్లు! పర్యాటక, ఆతిథ్య రంగాల కోసం యాక్సిస్ బ్యాంక్ సరికొత్త ప్రచారం: దేశవ్యాప్తంగా 5,000 మందికి పైగా వ్యాపారులతో అనుసంధానం జమ్మూకశ్మీర్ పారిశ్రామిక విధానం 2026-35 ముసాయిదాపై సీఎం ఒమర్ అబ్దుల్లా సమీక్ష: స్థానిక ఉపాధి, పెట్టుబడులే లక్ష్యం క్రమశిక్షణ, ప్రణాళికతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి ఆర్నభ్ తుఫాను బీభత్సంతో నీటమునిగిన మధురవాడ ప్రాంతాలు అవినీతి, కులతత్వం, వారసత్వ రాజకీయాలకు స్వస్తి: పనితీరు ఆధారిత రాజకీయాలను మోదీ ప్రభుత్వం తెచ్చింది.. అమిత్ షా వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయం రూ 2.50 కోట్లు భీమిలి తీరంలో గుర్తుతెలియని మగ శిశువు మృతదేహం పెంచలకోనలో రెండో రోజు శ్రీవారికి పవిత్రాల సమర్పణ గెడ్డలు మింగేశారు.. నగరాన్ని ముంచేశారు! వైఎస్సార్సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీల సేవలుఅమోఘం.మేకపాటి రాజగోపాల్ రెడ్డి మద్యం కుంభకోణంలో 3200 కోట్లు అవినీతి.=-సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో జడ్పీ చైర్ పర్సన్ అయ్యాను -- జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ

జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో జడ్పీ చైర్ పర్సన్ అయ్యాను -- జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ

Select Suryaa Now
జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో జడ్పీ చైర్ పర్సన్ అయ్యాను -- జడ్పీ చైర్ పర్సన్  ఆనం అరుణమ్మ

 

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్

వైయస్సార్సీపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తాను జడ్పీ చైర్ పర్సన్ అయ్యానని జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అన్నారు. గురువారం ఆమె తన చాంబర్లో తన ఐదేళ్ల పదవీకాలం పూర్తి అయిన సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను జడ్పీ చైర్ పర్సన్ గా 2021 సెప్టెంబర్ 25వ తేదీ జడ్పీ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టానని, ఈ ఐదేళ్ల కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు. 5 సంవత్సరాలు కాలంలో జిల్లా ప్రజా పరిషత్ సాధారణ విధుల నుంచి 955 పనులను 37.82 కోట్లు అంచనా విలువతో మంజూరు చేసి పనులు పూర్తిచేయడం జరిగిందన్నారు. అదేవిధంగా 15 ఆర్థిక సంఘ నిధులతో 1255 పనులను 59.16 కోట్ల పూర్తి చేయడం జరిగిందన్నారు. అలాగే 62 కోట్ల రూపాయలతో  237 పనులు, సి పి డబ్ల్యూ ఎస్ మరమ్మతులను చేయడం జరిగిందన్నారు. జడ్పీ నిధులతో తాగునీటి సమస్య, అంగన్వాడీ భవనాల మరమ్మతులు, డ్రైనేజీ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మంజూరు చేయడం జరిగిందన్నారు. జడ్పీ కి సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఆస్తులను పరిరక్షణ కొరకు తగిన చర్యలు చేపట్టి ఆదాయ వనరులు అందే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్య పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి ఇప్పటివరకు లేనివిధంగా ఎలాంటి జాప్యం లేకుండా అన్ని హోదాలలో 258 మందికి పదోన్నతులు కల్పించడం జరిగిందన్నారు. అదేవిధంగా 23 మందికి కారుణ్య నియామకపు ఉత్తర్వులు అందించినట్లు ఆమె తెలిపారు. ఈ ఐదేళ్ల తన పదవి కాలంలో ప్రభుత్వ ఉత్తర్వులు అందిన వెంటనే పారదర్శకంగా ఉద్యోగుల బదిలీలను చేయడం జరిగిందన్నారు. పారదర్శకమైన పాలన అందించా నని ఆమె తెలిపారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడం జరిగిందన్నారు. జిల్లా పరిషత్ సభ్యులకు కూడా ఆ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. అందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాను అన్నారు. తాను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆమె తెలిపారు. తనను తన ఐదేళ్ల పాలనలో ఎవరు తనకు ఇబ్బంది పెట్టలేదని, చివరి సమావేశానికి అధికారులు హాజరు కాలేదని ఆమె సందర్భంగా తెలిపారు. 14వ జడ్పీ చైర్ పర్సన్ గా తాను ఐదేళ్ల కాలం పూర్తి చేసుకున్నట్లు ఆమె తెలిపారు. వంటింటి గృహిణిగా ఉన్న తనను జడ్పీ చైర్ పర్సన్ గా ప్రోత్సహించి ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటానని ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఐదేళ్ల పదవి కాలం పూర్తి చేసుకున్న జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ దంపతులకు ఈ సందర్భంగా జడ్పీ ఉద్యోగులు కలిసి పుష్పగుచ్చాలు అందించి ఆమె సేవలను ప్రశంసించి అభినందించారు