BREAKING
శ్రీకాళహస్తీశ్వరాలయంలో హీరోయిన్ డింపుల్ హయాతి ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్! ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. పూజా మేరీ జాన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ముస్తాక్ ఖాన్ కన్నుమూత! ఆత్మవిశ్వాసమే ఆయుధంగా... అంతర్జాతీయ వేదికపై 'సోముదేవుపల్లి' కుర్రాడి అద్భుతం! నాని ‘ది ప్యారడైజ్’ తొలిరోజు బాక్సాఫీస్ కలెక్షన్లు.. రికార్డు స్థాయిలో వసూళ్లు! పర్యాటక, ఆతిథ్య రంగాల కోసం యాక్సిస్ బ్యాంక్ సరికొత్త ప్రచారం: దేశవ్యాప్తంగా 5,000 మందికి పైగా వ్యాపారులతో అనుసంధానం జమ్మూకశ్మీర్ పారిశ్రామిక విధానం 2026-35 ముసాయిదాపై సీఎం ఒమర్ అబ్దుల్లా సమీక్ష: స్థానిక ఉపాధి, పెట్టుబడులే లక్ష్యం క్రమశిక్షణ, ప్రణాళికతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి ఆర్నభ్ తుఫాను బీభత్సంతో నీటమునిగిన మధురవాడ ప్రాంతాలు అవినీతి, కులతత్వం, వారసత్వ రాజకీయాలకు స్వస్తి: పనితీరు ఆధారిత రాజకీయాలను మోదీ ప్రభుత్వం తెచ్చింది.. అమిత్ షా వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయం రూ 2.50 కోట్లు భీమిలి తీరంలో గుర్తుతెలియని మగ శిశువు మృతదేహం పెంచలకోనలో రెండో రోజు శ్రీవారికి పవిత్రాల సమర్పణ గెడ్డలు మింగేశారు.. నగరాన్ని ముంచేశారు! వైఎస్సార్సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీల సేవలుఅమోఘం.మేకపాటి రాజగోపాల్ రెడ్డి

మద్యం కుంభకోణంలో 3200 కోట్లు అవినీతి.=-సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

Select Suryaa Now
మద్యం కుంభకోణంలో 3200 కోట్లు అవినీతి.=-సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

మద్యం కుంభకోణంలో 3200 కోట్లు అవినీతి.

                                                                     ---సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
  ముత్తుకూరు, సెప్టెంబర్ 24 (మేజర్ న్యూస్) గత ప్రభుత్వ పరిపాలనలో మద్యం కుంభకోణంలో 3200 కోట్లు అవినీతి జరిగిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. గురువారం సాయంత్రం ఆయన మండలంలోని కప్పల దొరువు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా కూటమి పరిపాలనలో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మండల పార్టీ అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ తోపాటు పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులు ఉన్నారు. ఎమ్మెల్యేకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడారు. తమ ప్రభుత్వ పరిపాలనలో పరిశ్రమల నిర్మాణం ప్రథమ స్థానంలో ఉందన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యా శాఖలో మార్పులు వస్తున్నాయని తద్వారా పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో భూములు రికార్డులు మార్చేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి విమర్శించారు. వైసిపి ప్రభుత్వం లో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారి నుంచి భూములు స్వాధీనం చేసుకుంటున్న ప్రక్రియలో కోర్టు కేసులు ఎక్కువగా ఉన్నాయని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం మరో 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేశారని ఎమ్మెల్యే అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో సంబంధించిన పనులు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ పరిపాలనలో అవినీతి అరాచకం తప్ప అభివృద్ధి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు