ఆర్నభ్ తుఫాను బీభత్సంతో నీటమునిగిన మధురవాడ ప్రాంతాలు
నేలకొరిగిన అనేక కొండవాలు ప్రాంతాల నివాసాలు, భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు....
బిక్కుబిక్కుమని జీవనం సాగిస్తున్న కొండవాలు ప్రాంతాల నివాసాల ప్రజలు
పిఎం పాలెం సెప్టెంబర్ 24 మేజర్ న్యూస్..... ఆర్నభ్ తుఫాను బీభత్సంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మధురవాడ సమీపంలో ఉన్న 5,6,7 వార్డులలో ప్రాంతాలన్నీ అతలాకుతలంగా మారాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, కొండవాలు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.కొన్ని ప్రాంతాల్లో బుధవారం రాత్రి గాలి వర్షానికి భారీ వృక్షాలు నెలకొరిగి,విద్యుత్ స్తంభాలపై పడిపోవడంతో చాలా చోట్ల గురువారం రాత్రి వరకు కూడా విద్యుత్ సరఫరా లేక అంధకారంలోనే ప్రజలు జీవనం సాగించిన పరిస్థితి నెలకొంది.
వరుసగా విరిగిపోయిన మూడు విద్యుత్ స్తంభాలు....
ఆరో వార్డు పరిధి పి ఎం పాలెం ఆఖరి బస్టాప్ నుండి బాబా ఆలయానికి వెళ్ళే దారిలో భారీ వృక్షాలు నెలకొరిగి విద్యుత్ స్తంభాలపై పడిపోవడంతో వరుసగా మూడు విద్యుత్ స్తంభాలు విరిగిపోయిన పరిస్థితి నెలకొంది.దీనితో ఆ ప్రాంతంలో ప్రజలకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు.
70 మందిని రక్షించిన పిఎం పాలెం పోలీసులు, ఎన్ డి ఆర్ ఎఫ్, ఫైర్ సిబ్బంది
కొమ్మది టీచర్స్ లే అవుట్ సమీపంలో ప్రాంతాలన్నీ జలమయమవ్వడంతో సమీప ప్రాంతాలన్నీ చెరువులను తలపించాయి.దీనితో సమీపంలో ఉన్న రేఖ రెసిడెన్సీ సెల్లారులోకి భారీగా వర్షపు నీరు చేరి కారులు సైతం నీటమునిగాయి. భవనం లో నివాసముంటున్న ప్రజలు ప్రమాదంలో ఉన్నామని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పి ఎం పాలెం లా అండ్ ఆర్డర్, క్రైమ్, ఎన్ డి ఆర్ ఎఫ్, ఫైర్ సిబ్బంది పాల్గొని దాదాపుగా 70 మందినీ సురక్షితంగా రక్షించి సహాయక చర్యలు అందించారు.
కొమ్మది కొండవాలు ప్రాంతంలో నెలకొరిగి ఇళ్లు
కొమ్మది 5వ వార్డు పరిధిలోని కార్పెంటర్ కాలనీలో గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒక రేకుల షెడ్డు కూలిపోయింది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఈప్రమాదం జరిగింది.ఇల్లు కూలిన సమయంలో ఇంట్లోనే ఉన్న మెట్ట రాము, కాంచన దంపతులు, వారి ఇద్దరు పిల్లలు చిన్నచిన్న దెబ్బలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.
నీటమునిగిన సమాధులు....
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పి ఎం పాలెం శ్మశాన వాటిక వర్షపు నీటితో చెరువులను తలపించాయి. దీంతో సమాధులన్నీ నీట మునిగి దర్శనమిచ్చాయి.
కూలిన భారీ గోడ
జి వి ఎం సి ఆరో వార్డు పరిధి పి ఎం పాలెం హెచ్ పి సి ఎల్ లే అవుట్ లో సిరి రెసిడెన్సీ వద్ద గెడ్డ నీరు ఉధృతానికి అపార్ట్మెంట్ రక్షణ గోడ కూలింది.దీనితో అపార్ట్ మెంట్ లో నివాసమున్న ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.
చెరువుగా మారిన కుక్కల కంపెనీ
కొమ్మది కుక్కల కంపెనీ ప్రాంతం మొత్తం చెరువులుగా మారిన పరిస్థితి నెలకొంది. దీనితో సిబ్బంది,అందులో ఉన్న శునకాలు రాత్రి నుండి సహాయక చర్యలు లేక ఇబ్బందులకు గురయ్యారు.
చాలా చోట్ల నేలకొరిగిన భారీ వృక్షాలు
పి ఎం పాలెం హౌసింగా బోర్డు కాలనీలు,మిథిలా పూరి వుడా కాలనీ, కళా నగర్,కొమ్మది పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నెలకొరగడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.త్వరిత గతిన మధురవాడ జోన్ జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, ఎ ఎం హెచ్ వో రాజా రవికుమార్,మధురవాడ జోన్ విద్యుత్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోలాకి శ్రీనివాస రావు వారి సిబ్బందితో తక్షణ చర్యలు చేపట్టి సమస్యలను పరిష్కార మార్గంగా తీసుకెళ్లారు.