వైఎస్సార్సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీల సేవలుఅమోఘం.మేకపాటి రాజగోపాల్ రెడ్డి
వైఎస్సార్సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీల సేవలుఅమోఘం.మేకపాటి రాజగోపాల్ రెడ్డి
ఉదయగిరి మేజర్ న్యూస్ :
నియోజకవర్గంలో పదవీకాలం పూర్తి చేసుకున్న వైఎస్సార్సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు , ఎంపీపీలు ప్రజల కోసం అందించిన సేవలు, కష్టకాలంలో పార్టీ కోసం చేసిన కృషి ఎప్పటికీ మరువలేమని ఉదయగిరి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు.స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఐదేళ్లపాటు ప్రజల మధ్య ఉంటూ గ్రామాల అభివృద్ధికి, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడి పనిచేయడమే వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధుల ప్రత్యేకత అని పేర్కొన్నారు.స్థానిక సంస్థల్లో పార్టీ తరఫున ప్రజల మద్దతుతో ఎన్నికై బాధ్యతలు చేపట్టిన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు , ఎంపీపీలు అనేక ఒత్తిళ్లు, రాజకీయ పరిస్థితులను ఎదుర్కొంటూనే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజలతో మమేకమై పనిచేశారన్నారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో వారి పాత్ర కీలకమని పేర్కొన్నారు.
పదవీకాలం ముగిసినంత మాత్రాన ప్రజా సేవకు ముగింపు కాదని ఆయన అన్నారు. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో కూడా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఐక్యంగా ప్రజా సమస్యలపై పోరాడాలని ఆకాంక్షించారు.
నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బలోపేతానికి జడ్పీటీసీ, ఎంపీటీసీ మాజీ సభ్యులు,మాజీ ఎంపీపీలు అందించిన సేవలను పార్టీఎప్పటికీగుర్తుంచుకుంటుందని తెలిపారు.