BREAKING
బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ముస్తాక్ ఖాన్ కన్నుమూత! ఆత్మవిశ్వాసమే ఆయుధంగా... అంతర్జాతీయ వేదికపై 'సోముదేవుపల్లి' కుర్రాడి అద్భుతం! నాని ‘ది ప్యారడైజ్’ తొలిరోజు బాక్సాఫీస్ కలెక్షన్లు.. రికార్డు స్థాయిలో వసూళ్లు! పర్యాటక, ఆతిథ్య రంగాల కోసం యాక్సిస్ బ్యాంక్ సరికొత్త ప్రచారం: దేశవ్యాప్తంగా 5,000 మందికి పైగా వ్యాపారులతో అనుసంధానం జమ్మూకశ్మీర్ పారిశ్రామిక విధానం 2026-35 ముసాయిదాపై సీఎం ఒమర్ అబ్దుల్లా సమీక్ష: స్థానిక ఉపాధి, పెట్టుబడులే లక్ష్యం క్రమశిక్షణ, ప్రణాళికతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి ఆర్నభ్ తుఫాను బీభత్సంతో నీటమునిగిన మధురవాడ ప్రాంతాలు అవినీతి, కులతత్వం, వారసత్వ రాజకీయాలకు స్వస్తి: పనితీరు ఆధారిత రాజకీయాలను మోదీ ప్రభుత్వం తెచ్చింది.. అమిత్ షా వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయం రూ 2.50 కోట్లు భీమిలి తీరంలో గుర్తుతెలియని మగ శిశువు మృతదేహం పెంచలకోనలో రెండో రోజు శ్రీవారికి పవిత్రాల సమర్పణ గెడ్డలు మింగేశారు.. నగరాన్ని ముంచేశారు! వైఎస్సార్సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీల సేవలుఅమోఘం.మేకపాటి రాజగోపాల్ రెడ్డి మద్యం కుంభకోణంలో 3200 కోట్లు అవినీతి.=-సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో జడ్పీ చైర్ పర్సన్ అయ్యాను -- జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ

చిన్న, మధ్యతరహా పరిశ్రమల విజయానికి ఐదు అంశాలు కీలకం -- ➖ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు ➖ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు

Select Suryaa Now
   చిన్న, మధ్యతరహా పరిశ్రమల విజయానికి ఐదు అంశాలు కీలకం   -- ➖ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు                                                                 ➖ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు

చిన్న, మధ్యతరహా పరిశ్రమల విజయానికి ఐదు అంశాలు కీలకం

                                                             ➖ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు

➖ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవకాశాలు మెండు

➖ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందిస్తాం

➖ అవకాశాలను సృష్టించుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

నెల్లూరు,  కార్పొరేషన్, మేజర్ న్యూస్

చిన్న, మధ్యతరహా పరిశ్రమల విజయానికి సరైన ఉత్పత్తి ఎంపిక, ఆధునిక సాంకేతికత, ప్రాజెక్టు ఫైనాన్సింగ్, డిజిటైజేషన్, ఈ-కామర్స్–డిజిటల్ మార్కెటింగ్ అనే ఐదు అంశాలు కీలకమని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. గురువారం ఉదయం నెల్లూరు శ్రీ వెంకటేశ్వర కస్తూర్బ కళాక్షేత్రంలో జిల్లా పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ, ఎంఎస్ఎంఈ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ ఎంఎస్ఎంఈ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు.
కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ డెస్క్, బ్యాంకుల స్టాల్స్, ఉద్యమ రిజిస్ట్రేషన్, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్లకు ప్రత్యేక డెస్క్‌లను ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ పథకాలు, రుణ సదుపాయాలు, సబ్సిడీలు, పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులపై అధికారులు అవగాహన కల్పించారు. బ్యాంకింగ్ రంగ నిపుణులు రుణాల మంజూరు, ప్రాజెక్టు నివేదికలు, వడ్డీ రేట్లు, రుణాల తిరిగి చెల్లింపు విధానాలపై ఔత్సాహికులకు వివరించారు.
వ్యాపారం ప్రారంభించే ముందు స్థానికంగా, భవిష్యత్తులో ఏర్పడే పారిశ్రామిక అవకాశాలను అధ్యయనం చేసి సరైన ఉత్పత్తిని ఎంపిక చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు కానున్న బీపీసీఎల్ రిఫైనరీ నిర్మాణంతో వెల్డింగ్ రాడ్లు, ఆక్సిజన్, జేసీబీలు, వివిధ నిర్మాణ సేవలకు డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందన్నారు. రిఫైనరీ పూర్తయిన అనంతరం లభించే పెట్రోకెమికల్ ఉత్పత్తులను వినియోగించి వైర్లు, స్విచ్‌బోర్డులు తదితర తుది ఉత్పత్తుల తయారీకి అవకాశాలను పరిశీలించాలని తెలిపారు. నిర్మాణ దశకు మాత్రమే పరిమితమయ్యే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు కాలపరిమితి, పెట్టుబడి రాబడి, రుణ చెల్లింపులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ఆధునిక సాంకేతికతను వినియోగించడం ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవచ్చని, నాణ్యతతో పాటు ఒక్కో ఉత్పత్తిపై వచ్చే మార్జిన్‌పై దృష్టి పెట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యాపారం ప్రారంభ దశలో అవసరానికి మించి రుణాలు తీసుకోవద్దని, వడ్డీ రేటుతో పాటు మారటోరియం కాలం, నగదు ప్రవాహాన్ని పరిశీలించి ఫైనాన్సింగ్ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. అవసరమైన మేరకే రుణం తీసుకుని, ఆదాయం–ఖర్చులను సమతుల్యంగా నిర్వహించుకోవాలని చెప్పారు.
వ్యాపారం విస్తరించినప్పుడు కొనుగోళ్లు, అమ్మకాలు, ఖర్చులు, అకౌంటింగ్, ఉత్పత్తి నిర్వహణ వంటి కార్యకలాపాలను డిజిటల్ వ్యవస్థల ద్వారా పర్యవేక్షించుకోవాలని తెలిపారు. యజమాని ఎక్కడ ఉన్నా తన పరిశ్రమలో జరుగుతున్న కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం మొబైల్ ద్వారా అందేలా డిజిటల్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ-కామర్స్, డిజిటల్ మార్కెటింగ్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని కలెక్టర్ తెలిపారు. సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్, ఈ-కామర్స్ వేదికలను వినియోగించుకుని ఉత్పత్తులను విస్తృత మార్కెట్‌కు చేరువ చేయాలని సూచించారు. ఆన్‌లైన్ విక్రయాల ద్వారా విస్తృత మార్కెట్‌ను అందిపుచ్చుకోవడంతో పాటు వ్యాపార నిర్వహణ వ్యయాలను తగ్గించుకునే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు.
జిల్లాలో రాబోయే రోజుల్లో ఏర్పడనున్న పరిశ్రమలు, పారిశ్రామిక మౌలిక వసతులను దృష్టిలో పెట్టుకుని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కొత్త అవకాశాలను గుర్తించి ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం రుణాలు, సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలు, హ్యాండ్‌హోల్డింగ్ ద్వారా అవసరమైన సహకారం అందిస్తుందని తెలిపారు. వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఔత్సాహికులు నిపుణులు, సంబంధిత శాఖల అధికారులను సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా నగర మేయర్ దేవరకొండ సుజాత మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జిల్లాలో ప్రభావవంతమైన పరిశ్రమలు ఏర్పడనున్న నేపథ్యంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, రుణ సదుపాయాలు, వివిధ రాయితీలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా యువత, మహిళలు, నిరుద్యోగులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు.
కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ డైరెక్టర్ వీరేంద్ర కుమార్, ఏపీఐఐసీ డైరెక్టర్ కంచర్ల మాధవి, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం శ్రీధర్ బాబు, ఏపీఐఐసీ జెడ్‌ఎం శివకుమార్, ఎల్‌డీఎం మణిశేఖర్, చాంబర్ ఆఫ్ కామర్స్ నెల్లూరు ప్రతినిధులు ఒమ్మిన సతీష్ కుమార్, శేఖర్ రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నాగరాజుకుమారి, ఇండియా ఎస్ఎంఈ ఫోరం ప్రతినిధులు, బ్యాంకింగ్ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు పాల్గొన్నారు