BREAKING
ఆత్మవిశ్వాసమే ఆయుధంగా... అంతర్జాతీయ వేదికపై 'సోముదేవుపల్లి' కుర్రాడి అద్భుతం! నాని ‘ది ప్యారడైజ్’ తొలిరోజు బాక్సాఫీస్ కలెక్షన్లు.. రికార్డు స్థాయిలో వసూళ్లు! పర్యాటక, ఆతిథ్య రంగాల కోసం యాక్సిస్ బ్యాంక్ సరికొత్త ప్రచారం: దేశవ్యాప్తంగా 5,000 మందికి పైగా వ్యాపారులతో అనుసంధానం జమ్మూకశ్మీర్ పారిశ్రామిక విధానం 2026-35 ముసాయిదాపై సీఎం ఒమర్ అబ్దుల్లా సమీక్ష: స్థానిక ఉపాధి, పెట్టుబడులే లక్ష్యం క్రమశిక్షణ, ప్రణాళికతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి ఆర్నభ్ తుఫాను బీభత్సంతో నీటమునిగిన మధురవాడ ప్రాంతాలు అవినీతి, కులతత్వం, వారసత్వ రాజకీయాలకు స్వస్తి: పనితీరు ఆధారిత రాజకీయాలను మోదీ ప్రభుత్వం తెచ్చింది.. అమిత్ షా వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయం రూ 2.50 కోట్లు భీమిలి తీరంలో గుర్తుతెలియని మగ శిశువు మృతదేహం పెంచలకోనలో రెండో రోజు శ్రీవారికి పవిత్రాల సమర్పణ గెడ్డలు మింగేశారు.. నగరాన్ని ముంచేశారు! వైఎస్సార్సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీల సేవలుఅమోఘం.మేకపాటి రాజగోపాల్ రెడ్డి మద్యం కుంభకోణంలో 3200 కోట్లు అవినీతి.=-సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో జడ్పీ చైర్ పర్సన్ అయ్యాను -- జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల విజయానికి ఐదు అంశాలు కీలకం -- ➖ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు ➖ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు

మూలస్థానేశ్వరాలయంలో ప్రదోషకాల పూజ

Select Suryaa Now
మూలస్థానేశ్వరాలయంలో ప్రదోషకాల పూజ

మూలస్థానేశ్వరాలయంలో ప్రదోషకాల పూజ

నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ 
నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ప్రదోషకాల పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రదోష వేళ శ్రీ నందీశ్వర స్వామి వారికి, మూలవిరాట్ శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారికి వేదపండితులు విశేష సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
అనంతరం సాయంత్రం వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఉత్సవమూర్తులను చిన్న వెండి నంది వాహనంపై అధిష్టింపజేశారు.  భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కర్పూర హారతులు సమర్పించి, స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ ఉత్సవానికి నెల్లూరు వాస్తవ్యులు పత్తి రాజేష్ ఉభయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం ఆలయ ఛైర్మన్ అజయ్, సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, ధర్మకర్త మండలి సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లను పర్యవేక్షించారు