BREAKING
జమ్మూకశ్మీర్ పారిశ్రామిక విధానం 2026-35 ముసాయిదాపై సీఎం ఒమర్ అబ్దుల్లా సమీక్ష: స్థానిక ఉపాధి, పెట్టుబడులే లక్ష్యం క్రమశిక్షణ, ప్రణాళికతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి ఆర్నభ్ తుఫాను బీభత్సంతో నీటమునిగిన మధురవాడ ప్రాంతాలు అవినీతి, కులతత్వం, వారసత్వ రాజకీయాలకు స్వస్తి: పనితీరు ఆధారిత రాజకీయాలను మోదీ ప్రభుత్వం తెచ్చింది.. అమిత్ షా వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయం రూ 2.50 కోట్లు భీమిలి తీరంలో గుర్తుతెలియని మగ శిశువు మృతదేహం పెంచలకోనలో రెండో రోజు శ్రీవారికి పవిత్రాల సమర్పణ గెడ్డలు మింగేశారు.. నగరాన్ని ముంచేశారు! వైఎస్సార్సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీల సేవలుఅమోఘం.మేకపాటి రాజగోపాల్ రెడ్డి మద్యం కుంభకోణంలో 3200 కోట్లు అవినీతి.=-సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో జడ్పీ చైర్ పర్సన్ అయ్యాను -- జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల విజయానికి ఐదు అంశాలు కీలకం -- ➖ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు ➖ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు గోడౌన్ల వద్ద ప్రతిష్ట భద్రతా చర్యలు --- కలెక్టర్ మూలస్థానేశ్వరాలయంలో ప్రదోషకాల పూజ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో వైభవంగా ప్రదోష కాల పూజ

నారాయణ మెడికల్ కాలేజీలో ఘనంగా 57వ ఎన్‌ఎస్‌ఎస్ ఫౌండేషన్ డే

Select Suryaa Now
నారాయణ మెడికల్ కాలేజీలో ఘనంగా 57వ ఎన్‌ఎస్‌ఎస్ ఫౌండేషన్ డే

నారాయణ మెడికల్ కాలేజీలో ఘనంగా 57వ ఎన్‌ఎస్‌ఎస్ ఫౌండేషన్ డే

నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ 
నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో 57వ ఎన్‌ఎస్‌ఎస్ ఫౌండేషన్ డే వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఇదే వేదికపై విద్యార్థుల్లోని ప్రతిభ, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకతను వెలికితీసేందుకు ఉద్దేశించిన ‘వివిధ - స్టూడెంట్ క్లబ్స్’ను కూడా అధికారికంగా ప్రారంభించారు. కళాశాల డీన్, ఎన్‌ఎస్‌ఎస్ చైర్మన్ డాక్టర్ పి. శ్రీనివాసులు రెడ్డి మార్గదర్శకత్వంలో, నోడల్ ఆఫీసర్ డాక్టర్ డి.ఎం. కార్తిక్ సమన్వయంతో ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.
జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ముందుగా డీన్ డాక్టర్ పి. శ్రీనివాసులు రెడ్డి ఎన్‌ఎస్‌ఎస్ వార్షిక నివేదికను సమర్పించారు. విద్యార్థులు చేపట్టిన వివిధ సేవా, సామాజిక అవగాహన కార్యక్రమాలను ఆయన కొనియాడారు. విశిష్ట సేవలు అందించిన వాలంటీర్లకు బ్యాడ్జీలు ప్రదానం చేసి, వారితో ఎన్‌ఎస్‌ఎస్ ప్రతిజ్ఞ చేయించారు. ఎన్‌ఎస్‌ఎస్‌కు విశేష సహకారం అందిస్తున్న డీన్‌ను ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు ఘనంగా సత్కరించారు.
అనంతరం విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ‘వివిధ’ స్టూడెంట్ క్లబ్స్ లోగోను, మ్యాగజైన్‌ను డీన్ ఆవిష్కరించారు. స్టూడెంట్ కౌన్సిల్ నియామక ఉత్తర్వులపై సంతకం చేసి నోడల్ ఆఫీసర్ కు అందజేశారు. 
ఈ కార్యక్రమంలో పలువురు విభాగాధిపతులు (హెచ్‌ఓడీలు), అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.