BREAKING
మత్తు పదార్థాల నిర్మూలన సమిష్టి బాధ్యత ఢిల్లీ, పశ్చిమ యూపీకి ఆరెంజ్ అలర్ట్‌.. భారీ వర్షాల హెచ్చరిక రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పరిశీలన 20 ఎకరాల్లో రామగుండానికి ‘ఇందిరమ్మ టవర్స్‌’! సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై విమర్శలపై స్పందించిన వైఎస్‌ జగన్‌ పారదర్శకత, జవాబుదారీతనం ఈసీ ప్రాథమిక బాధ్యత: జగన్‌ మంత్రి సీతక్క సమీక్షా సమావేశానికి  పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి గోదావరి నీటిలో భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి సొసైటీ ద్వారా రైతులకు స్వల్ప కాలిక రుణాలు అందజేస్తాం ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అఘాయిత్యం, పోక్సో చట్టం కింద కేసు నమోదు నూతన గ్రంథాలయ భవనానికి భూమిపూజ.. మహేష్ కుమార్ గౌడ్.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలి. నావికుల భద్రతపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన తాండూరులో గర్జించిన తీన్మార్ మల్లన్న ప్రజాస్వామ్య లోటును సృష్టించే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలపై కాంగ్రెస్ నజర్.. ఇటావా, కన్నౌజ్, మైన్‌పురిలలో త్వరలో పర్యటన: అజయ్ రాయ్

ఖోఖోలో యాలాల జెడ్పీహెచ్‌ఎస్‌ అదుర్స్‌..!

Select Suryaa Now
ఖోఖోలో యాలాల జెడ్పీహెచ్‌ఎస్‌ అదుర్స్‌..!

 

విజేతగా నిలిచి జిల్లా స్థాయి పోటీలకు దూసుకెళ్లిన విద్యార్థులు

యాలాల, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 24): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యాలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కబడ్డీ, వాలీబాల్,ఖోఖో పోటీలు గురువారం ముగిశాయి.యాలాల,తాండూర్,బషీరాబాద్ మండలాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు అండర్‌–14, అండర్‌–17 విభాగాల్లో బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు.గురువారం నిర్వహించిన ఖోఖో పోటీల్లో అండర్‌–17 విభాగంలో యాలాల జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు విజయం సాధించారు.పోటీలు పాఠశాల పీడీ,స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జోనల్ సెక్రటరీ రాజశేఖర్ పర్యవేక్షణలో జరిగాయి.ఈ సందర్భంగా సీనియర్ పీడీ అనంతయ్య మాట్లాడుతూ.. విద్యార్థుల్లో శారీరక దృఢత్వం,క్రమశిక్షణ,సమష్టి భావన పెంపొందించేందుకు క్రీడలు ఎంతో అవసరమన్నారు. పోటీలను విజయవంతం చేసేందుకు వివిధ పాఠశాలల పీఈటీలు సహకరించారని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిద్రామేశ్వర్, పీడీ రాజశేఖర్ వారికి ధన్యవాదాలు తెలిపారు.పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జిల్లా స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ రాజశేఖర్ తెలిపారు.రిపోర్టర్ ప్రకాష్ గౌడ్