తాడేపల్లిగూడెం సందర్శించిన ఎమ్మెల్యే బలిశెట్టి కలెక్టర్ నాగరాణి
తాడేపల్లిగూడెం డంపింగ్ యార్డ్ ను సందర్శించిన ఎమ్మెల్యే బొలిశెట్టి, జిల్లా కలెక్టర్ నాగరాణి.
తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తాడేపల్లిగూడెం పురపాలక సంఘం పరిధిలోని డంపింగ్ యార్డ్ ను ఈరోజు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ నాగరాణి సంయుక్తం గా సందర్శించారు. భారీ వర్షం పడుతున్నప్పటికీ గొడుగులతో డంపింగ్ యార్డ్ లోకి వెళ్లి, అక్కడ జరుగుతున్న పనులు, చెత్త నిర్వహణ విధానం, తుఫాన్ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా స్పెషల్ గ్రేడ్ కమిషనర్ యేసుబాబు, డంపింగ్ యార్డ్ నిర్వహణ, రోజువారీ వస్తున్న చెత్త పరిమాణం, బయో మైనింగ్, సెగ్రిగేషన్ పనుల గురించి ఎమ్మెల్యేకి, కలెక్టర్ కి వివరించారు. డంపింగ్ యార్డ్ వద్ద పారిశుధ్యం మెరుగ్గా ఉండేలా చూడాలని, వర్షాల వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీనివాస్ తాడేపల్లిగూడెం