BREAKING
రేపు సాయంత్రానికి వినాయక నిమజ్జనం పూర్తి మత్తు పదార్థాల నిర్మూలన సమిష్టి బాధ్యత ఢిల్లీ, పశ్చిమ యూపీకి ఆరెంజ్ అలర్ట్‌.. భారీ వర్షాల హెచ్చరిక రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పరిశీలన 20 ఎకరాల్లో రామగుండానికి ‘ఇందిరమ్మ టవర్స్‌’! సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై విమర్శలపై స్పందించిన వైఎస్‌ జగన్‌ పారదర్శకత, జవాబుదారీతనం ఈసీ ప్రాథమిక బాధ్యత: జగన్‌ మంత్రి సీతక్క సమీక్షా సమావేశానికి  పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి గోదావరి నీటిలో భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి సొసైటీ ద్వారా రైతులకు స్వల్ప కాలిక రుణాలు అందజేస్తాం ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అఘాయిత్యం, పోక్సో చట్టం కింద కేసు నమోదు నూతన గ్రంథాలయ భవనానికి భూమిపూజ.. మహేష్ కుమార్ గౌడ్.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలి. నావికుల భద్రతపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన తాండూరులో గర్జించిన తీన్మార్ మల్లన్న ప్రజాస్వామ్య లోటును సృష్టించే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు

కూకట్‌పల్లి జ్యువెల్ హైట్స్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం.. రూ. 3,02,000లకు లడ్డును దక్కించుకున్న సూర ప్రసేన్‌జిత్, శరత్ బృందం!

Select Suryaa Now
కూకట్‌పల్లి జ్యువెల్ హైట్స్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం.. రూ. 3,02,000లకు లడ్డును దక్కించుకున్న సూర ప్రసేన్‌జిత్, శరత్ బృందం!

సూర్య తెలంగాణ డెస్క్: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జ్యువెల్ హైట్స్ ప్రాంగణంలో వినాయక నిమజ్జన వేడుకలు అత్యంత వైభవంగా మరియు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా స్థానిక నివాసితులు, భక్తులు భారీ సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని గణనాథునికి భక్తితో వీడ్కోలు పలికారు. ఈ వేడుకల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక లడ్డు వేలం పాటలో భక్తులు అత్యంత ఉత్సాహంగా పాల్గొని గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేశారు.

ఈ వేలంలో సూర ప్రసేన్‌జిత్ మరియు శరత్ గారు సంయుక్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో ఏకంగా మూడు లక్షల రెండు వేల రూపాయలు (రూ. 3,02,000) చెల్లించి గణపతి ప్రసాదమైన లడ్డును పాట పాడి దక్కించుకున్నారు. స్వామివారిపై ఉన్న అంతులేని భక్తితో వారు ఈ భారీ మొత్తానికి లడ్డును సొంతం చేసుకోవడం విశేషం. ఈ వేడుకల సందర్భంగా మంటప ప్రాంతమంతా భక్తుల నామస్మరణతో మరియు గణేష్ మహారాజ్ కి జై నినాదాలతో పూర్తిగా మార్మోగింది.