బాలపూర్ గణపయ్యకు సబితమ్మ ప్రత్యేక పూజలు
బాలాపూర్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 24) : గణపతి బప్పా మోరియా అనే నామస్మర
ణతో బాలాపూర్ గణనాథుడి సన్నిధి భక్తిభావంతో మార్మోగింది. మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తోపాటు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు (కేటీ
ఆర్) బాలాపూర్ మహాగణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిం
చారు. అదేవిధంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్
రెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి తది
తరులు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉత్సవ సమితి తరఫున విచ్చేసిన అతిథు
లను శాలువాలతో సత్కరించి, స్వామి
వారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం బడంగ్‌పేట్‌లోని భారీ గణనాథుడిని దర్శించుకుని పూజలు నిర్వహిం
చారు.బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు. విచ్చేసిన అతిధులు మాట్లాడుతూ..ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నేతలు ఆకాంక్షించారు. కార్యక్రమంలో వంగేటి లక్ష్మారెడ్డి, కళ్లెం ఎల్లారెడ్డి, చిగురింత పెద్ద నరసింహారెడ్డి, గుండోజి రఘునందన్‌చారి, అత్తాపురం శ్రీనివాస్‌రెడ్డి, జూకంటి సురేష్‌గౌడ్, తిమ్మని గిరేష్, మున్నా, అరవింద్‌గౌడ్, విజయ్, రితున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : బి.గణేష్.