శ్రీ రాజరాజేశ్వరి ఆలయ ఈవోగా నూతలపాటి శ్రీధర్ నాయుడు
శ్రీ రాజరాజేశ్వరి ఆలయ ఈవోగా నూతలపాటి శ్రీధర్ నాయుడు
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్
నెల్లూరు దుర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి (అడిషనల్ ఛార్జ్ ఈవో)గా నూతలపాటి శ్రీధర్ నాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా పూడిపర్తి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనను రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానానికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆ ఉత్తర్వుల మేరకు, గురువారం ఉదయం 9 గంటల 25 నిమిషాలకు ఆలయ ప్రాంగణంలో ఆయన శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి పదవీ బాధ్యతలు చేపట్టారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దేవస్థాన పాలకమండలి, అర్చక బృందం ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీమతి ఏలూరు శిరీషతో పాటు ధర్మకర్తల మండలి సభ్యులతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు కుల్లూరు వీర రాఘవేంద్ర, సూరావర్ణుల రఘురామమూర్తి, వేద పండితులు, అర్చక స్వాములు, ఆలయ సిబ్బంది హాజరై నూతన ఈవోకు శుభాకాంక్షలు తెలిపారు.