సద్దుల బతుకమ్మతో...మణుగూరులో పూల సందడి
మణుగూరు ఆర్ సి సూర్య(మేజర్ న్యూస్);తెలంగాణ సంస్కృతికి,సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందడి మణుగూరు పట్టణంలో ఆదివారం తెల్లవారుజామునుండే మొదలైంది.చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి అనేకమంది మహిళలు రంగు రంగుల పూలను మార్కేట్ కు తీసుకువచ్చారు.బతుకమ్మను పెర్చేందుకు ముఖ్యంగా ఉపయోగించే తంగేడు,గునుగు,టేకు,బంతి,తామర ఇలా అనేక రకాల పూలతో మణుగూరు పట్టణం రంగుల మయంగా మారింది.ఎక్కడెక్కడో నివసించే ఆడపడుచులు సద్దుల బతుకమ్మ పండుగ కోసం తమ సొంత గ్రామాలకు చేరుకున్నారు.