బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల శుభాకాంక్షలు తెలిపిన మహమ్మద్ నసీద్
కొండపాక ; తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ, విజయానికి ప్రతీకైన దసరా, వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకుడు మహమ్మద్ నసీద్ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగలను ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు.తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగకు ప్రత్యేక స్థానం ఉందని, ఆడపడుచులు పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయబద్ధంగా జరుపుకునే ఈ వేడుకలు రాష్ట్ర సంస్కృతి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాలను తీసుకురావాలనిఆకాంక్షించారు.అదేవిధంగా దీపావళి పండుగ ప్రతి ఇంటా వెలుగులు నింపాలని, ప్రజల మధ్య ప్రేమానురాగాలు, సోదరభావం పెంపొందాలని తెలిపారు. పండుగల సందర్భంగా ప్రజలందరూ పరస్పర స్నేహభావంతో, ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.