నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం
నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం
మానవత్వంతో ఆదుకున్న 5వ వార్డు కౌన్సిలర్ మమత రాజు
ఇబ్రహీంపట్నం:
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో ఇటీవల మృతి చెందిన మాచర్ల చిన్న చెన్నమ్మ కుటుంబాన్ని వార్డు కౌన్సిలర్ జెర్కోని మమత రాజు పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. ఆమె ఆదేశాల మేరకు నేనావత్ జెలేంధర్ (చిన్న) బాధిత కుటుంబానికి క్వింటాల్ బియ్యంతో పాటు రూ.5,000 నగదు అందజేశారు. కుటుంబానికి అండగా నిలిచి, కష్టకాలంలో భరోసా కల్పించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కొండ్రు రవి, కొండ్రు మహేష్, కొండ్రు ప్రభు, కొండ్రు విజయ్, కొండ్రు వికాస్, మాచర్ల రవి, కుటుంబ సభ్యులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.