BREAKING
ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నిరు పేదల జీవితాల్లో పెన్షన్ల వెలుగులు! రాయికోడ్ మండలానికి 584 నూతన పెన్షన్లు మంజూరు మూడేళ్లయినా అమలుకాని రూ.4 వేల పెన్షన్ హామీ! అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి పల్లె ప్రకృతి ఒడిలో ఫార్మ్ ఎలైట్ రిసార్ట్ ప్రారంభం 9 కోట్లతో భారీ నందీశ్వర స్వామి విగ్రహ నిర్మాణం 684 టన్నుల ఏకశిలతో సువర్ణ శృంగ నందీశ్వర విగ్రహం కాంగ్రెస్ హామీల అమలుకు మిగిలింది రెండేళ్లే! మూడేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో అమలుకాని హామీలు జిన్నారం - బొంతపల్లి రోడ్డుపై ప్రమాదకర గుంతలు వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం నైపుణ్య విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు వృత్తి కోర్సులపై ప్రత్యక్ష అవగాహన యాసంగి పంటలు షురూ.. కాలం కరుణిస్తుందా? కరువు ఛాయాల్లో యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలు జ్ఞాన జ్యోతులకు ఘన నివాళి ధాన్యంకొనుగోళ్లలోరైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు wa పృథ్వీరెడ్డికి కేంద్ర మంత్రి ఆశీస్సులు ముగిసిన పాదయాత్ర.. కేసీఆర్‌ను కలిసిన మల్లేష్ బృందం! పాదయాత్ర బృందానికి కేసీఆర్ అభినందనలు నా అడ్డ తుంగతుర్తి.. నా గడ్డ తుంగతుర్తి.. నా పోరాటం తుంగతుర్తి కోసమే" చేయూత పెన్షన్ మంజూరి పత్రముల పంపిణీ కార్యక్రమములో ఎమ్మెల్యే మందుల సామేల్

పాశమైలారంలో పూల పండుగకు పండుగ శోభ.! -చైర్మన్ మోటే సుమలత శ్రీకాంత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
పాశమైలారంలో పూల పండుగకు పండుగ శోభ.! -చైర్మన్ మోటే సుమలత శ్రీకాంత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు

పటాన్‌చెరు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పే బతుకమ్మ సంబరాలు పాశమైలారంలో అంబరాన్నంటాయి. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాశమైలారం గ్రామంలో మున్సిపల్ చైర్మన్ మోటే సుమలత శ్రీకాంత్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూలతో పేర్చిన బతుకమ్మలు, సంప్రదాయ పాటలు, ఆడపడుచుల ఆటపాటలతో గ్రామమంతా పండుగ శోభను సంతరించుకుంది. వేడుకల నిర్వహణకు చేసిన ఏర్పాట్లు మహిళలను ఆకట్టుకున్నాయి.

పూల బతుకమ్మలతో ప్రత్యేక ఆకర్షణ

బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలు, యువతులు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి వేడుకలకు తరలివచ్చారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు. సింగర్ ఆలపించిన బతుకమ్మ పాటలు వేడుకల్లో మరింత జోష్ నింపాయి. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పాశమైలారంలో పూల పండుగ సందడి నెలకొంది.

ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మోటే సుమలత శ్రీకాంత్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. ప్రకృతిని పూజిస్తూ, పూలను ఆరాధిస్తూ జరుపుకునే ఈ పండుగ ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని, ఆత్మీయతను నింపుతుందని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.మహిళలందరూ ఐకమత్యంతో బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ఇలాంటి సాంస్కృతిక వేడుకలు ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని మరింత పెంపొందిస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఘనంగా వేడుకలు.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రముఖులు

చైర్మన్ మోటే సుమలత శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. పాశమైలారంలో పండుగ వాతావరణం నెలకొనగా, ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ వెంకట కిషన్ రావు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.