దైవచింతనతో మానసిక ప్రశాంతత : కౌశిక్ రెడ్డి
దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత *దుర్గామాత పూజలో పాల్గొన్న కౌశిక్ రెడ్డి
జల్ పల్లి : దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని బిఆర్ఎస్ యువనేత పట్లోళ్ల కౌశిక్ రెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గము పరిధి జల్ పల్లి సర్కిల్ పరిధి, శ్రీరామ కాలనీలో జయభేరి యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారి పూజలో శుక్రవారం మాజీ కౌన్సిలర్ పల్లపు శంకర్, స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలిసి, కౌశిక్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుల వేదమంత్రోచ్ఛరణల మద్య అమ్మవారికి భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన పూజలు జరిపారు. తదానంతరం వేద పండితులు మండప కమిటీ సభ్యులు కౌశిక్ రెడ్డికి తీర్థ ప్రసాదములు అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం అన్నవితరణ ప్రసాద కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్న ప్రసాద వితరణ అందించారు. శ్రీరామ కాలనీలోని వివిధ మండపాల్లో యంగ్ ఇండియన్ యూత్ అసోసియేషన్ అమ్మవారిని, నవభారత్ యూత్ అసోసియేషన్ అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతూ. పవిత్ర దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రతి ఒక్కరికీ శ్రీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ, దుర్గమ్మ అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని కౌశిక్ రెడ్డి కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో జయభేరి యూత్ కమిటీ సభ్యులు, నాయకులు కార్యకర్తలు భక్తులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
అంకం జగన్ : మేజర్ న్యూస్.